వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర ఈ నెల 9న ప్రారంభం
Updated:
07-04-2018 01:07:49
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ ఈ నెల 9న ప్రారంభం కానుంది. మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా యాత్ర పేరుతో ఈ సినిమా రూపొందనుంది. మహి వి రాఘవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శశిదేవి రెడ్డి, విజయ్ చిల్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 60 రోజుల పాటు 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన వైఎస్ ఆర్ సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ఫీజ్ రీఎంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ తదితర కార్యక్రమాలతో తెలుగువారి గుండెల్లో కొలువైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని తెరపై చూపించేందుకు యాత్ర టీం యత్నిస్తోంది.