Updated: 05-04-2018 08:49:26
న్యూఢిల్లీ: టీడీపీ నేత, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గురువారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో కళ్లు తిరిగిపడిపోయారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాజస్యభలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. వీరికి మద్దతుగా పార్లమెంటు సెంట్రల్ హాలులో టీడీపీ లోక్‌సభ సభ్యులు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో ఎంపీ అవంతి శ్రీనివాస్‌కు ఒక్కసారిగా బీపీ తగ్గడంతో అక్కడే కళ్లు తిరిగి పడిపోయారు. గుండెనొప్పి లక్షణాలు కూడా కనపడటంతో పార్లమెంటు ఆవరణలోని వైద్యులు వెంటనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.
షేర్ :
తాజా వార్తలు