మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

రూ.65తో ఎయిర్‌టెల్ సూపర్ ఆఫర్

Updated: 28-03-2018 08:24:19

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మరో సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. జియో ఫోన్ల కోసం రిలయన్స్ తీసుకొచ్చిన రూ.49 ప్లాన్‌ను ఎదుర్కొనేందుకు రూ.65తో కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. వ్యాలిడిటీ 28 రోజులు. అయితే ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా 1జీబీ 2జీ/3జీ డేటా లభిస్తుంది. ‘మై ఎయిర్‌టెల్’ యాప్ ద్వారా ఈ ఆఫర్‌కు అర్హులమో కాదో వినియోగదారులు చెక్ చేసుకోవచ్చు. 
 
రిలయన్స్ జియోను ఎదురొడ్డేందుకు ఎయిర్‌టెల్ ఇటీవల పలు ప్లాన్లను లాంచ్ చేసింది. అలాగే ఎంపిక చేసిన రాష్ట్రాల్లో వాయిస్ ఓవర్ ఎల్టీఈ బీటా వెర్షన్‌ను ప్రారంభించింది. నెట్ వర్క్ టెస్టింగ్‌లో భాగంగా వినియోగదారులకు మూడు విడతలుగా 30 జీబీని ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతం ఈ సేవలు ఏపీ, వెస్ట్ బెంగాల్, ఒడిశా, అసోం, కేరళ, బిహార్, పంజాబ్‌లలో అందుబాటులో ఉన్నాయి. 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.