మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

తండ్రిని కోల్పోయిన బెన‌ర్జీని ప‌రామ‌ర్శించిన చిరంజీవి

Updated: 16-04-2018 02:16:26

తండ్రిని కోల్పోయిన సినీ న‌టుడు బెన‌ర్జీని మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. బెనర్జీ తండ్రి, న‌టుడు రాఘ‌వ‌య్య ఆదివారం ఉద‌యం క‌న్నుమూశారు. ఆయ‌న మృతిప‌ట్ల టాలీవుడ్ దిగ్ర్బాంతిని వ్య‌క్తం చేసింది. తాజాగా హీరో చిరంజీవి సోమ‌వారం ఉదయం బెన‌ర్జీ ఇంటికెళ్లి ప‌రామ‌ర్శించారు. రాఘ‌వ‌య్య మృతిప‌ట్ల చిరంజీవి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఈ సంద‌ర్భంగా  చిరంజీవి  ఆయ‌నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
 
బెనర్జీ తండ్రి రాఘవయ్య కన్నుమూశారు. రాఘవయ్య వయసు 86 సంవత్సరాలు. వీరాంజనేయ, కథానాయకుడు, యమగోల, భరత్ అనే నేను సినిమాల్లో ఆయన నటించారు. ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. 
 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.