ఉత్కంఠపోరులో కోల్‌కతాపై చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు
Updated:
11-04-2018 12:22:36
చెన్నై: ఐపీఎల్ పోటీల్లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. 203 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు ఒక బంతి మిగిలి ఉండగానే ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. చెన్నై ఆటగాళ్లలో బిల్లింగ్స్ 56, వాట్సన్ 42, రాయుడు 39, ధోనీ 25 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో వాట్సన్ 2, హర్భజన్, జడేజా, ఠాకూర్ తలా ఓ వికెట్ తీశారు. కోల్‌కతా ఆటగాళ్లలో రస్సెల్ 88, ఊతప్ప 29, కార్తీక్ 26 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో కుర్రస్ 2, చావ్లా, సరైస్, కుల్దీప్ తలా ఓ వికెట్ తీశారు.