మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

జైలులో సల్మాన్.. వాటే పోజ్!

Updated: 05-04-2018 08:40:00

జోధ్‌పూర్: కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఐదేళ్ల శిక్ష పడిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. జైలులోని రెండో బ్యారక్‌లో ఖైదీగా ఉండనున్న సల్మాన్ జైలులో రిలాక్సడ్‌గా కూర్చున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో 20 ఏళ్లపాటు విచారణ చేపట్టిన జోధ్‌పూర్ కోర్టు ప్రధాన నిందితుడైన సల్మాన్‌ను గురువారం దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. తీర్పు వినగానే సల్మాన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బోరున విలపించాడు. పక్కనే ఉన్న చెల్లెళ్లు సల్మాన్‌ను ఓదార్చారు. జైలులో సాధారణ ఖైదీలకు దక్కని రాచమర్యాదలు వీఐపీలు, సెలబ్రిటీలకు లభిస్తాయన్న అభిప్రాయాన్ని సల్మాన్ తాజా ఫొటో ఓ ప్రత్యక్ష ఉదాహరణ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు బెయిల్ పిటీషన్ కోసం సల్మాన్ తరపు న్యాయవాది పై కోర్టును ఆశ్రయించనున్నారు. 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.