మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

నాకు.. ఆ ట్విట్టర్ ఎకౌంట్‌కి సంబంధం లేదు- యాంకర్ రవి

Updated: 26-04-2018 12:27:20

తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా కొన్ని మీడియా ఛానల్స్‌పై అసభ్య వ్యాఖ్యానాలు వస్తున్నాయనే ఆరోపణలపై యాంకర్ రవి స్పందించాడు. ఆ ట్విట్టర్ ఎకౌంట్‌కీ తనకూ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. "నా సోషల్ మీడియా ఎకౌంట్స్ అన్నిట్నీ వ్యాక్డ్ అవుట్ మీడియా మెయింటైన్ చేస్తుంది. గత కొన్నేళ్లుగా నేను ట్విట్టర్‌లో యాక్టివ్‌గా లేను. కేవలం ఫేస్ బుక్ మాత్రమే వాడుతున్నాను. అయినా.. నా పేరుతో ఎవరో తెలియనివారు ట్విట్టర్ ఎకౌంట్ యూజ్ చేస్తూ నా పేరు మీద అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్నారు. వారిపై నేను లీగల్‌గా కేస్ వేసి ప్రొసీడ్ అవుతాను. మీడియా మిత్రులు ఎవరూ సదరు ట్వీట్స్ గురించి కన్ఫ్యూజ్ అవ్వొద్దని నా మనవి" అని రవి వివరించాడు.

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.