మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

వి.వి.వినాయ‌క్ చేతుల మీదుగా అమ్మ‌మ్మ‌గారిల్లు టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

Updated: 23-04-2018 10:40:34

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్ మ‌రియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `అమ్మమ్మగారిల్లు`. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  ఈ సినిమా టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ ప్ర‌సాద్  ల్యాబ్స్ లో ఘ‌నంగా జ‌రిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ టీజ‌ర్ ను ఆవిష్క‌రించారు. 
 
అనంత‌రం వినాయ‌క్ మాట్లాడుతూ, ` ఫ‌స్టు లుక్ పోస్ట‌ర్ చూడ‌గానే నా బాల్యం గుర్తొచ్చింది. చిన్న‌ప్పుడు అమ్మ‌మ్మ‌గారిల్లు,అక్క‌డ వాతావ‌ర‌ణం అన్నీ ఒక్క‌సారిగా క‌ళ్ల‌ముందు ప్ర‌త‌క్ష్య‌మైన‌ట్లు అనిపించింది. ఆ జ్ఞాప‌క‌ల‌న్నీ మ‌ధుర‌మైన‌వి. వేస‌వి సెల‌వులు వ‌స్తే అక్క‌డే గ‌డిపేవాడిని.  మా అమ్మ‌మ్మ‌గారిల్లు కూడా అలాగే ఉండేది. ఈ విష‌యంలో డైరెక్ట‌ర్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా. మంచి ఆర్టిస్టులు..క‌థ కుదిరాయి. ర‌సూల్ మంచి టెక్నీషియ‌న్. సినిమా పెద్ద విజయం సాధించాలి. నిర్మాత‌లు మ‌రిన్ని మంచి సినిమాలు చేయాలి` అని అన్నారు.
 
హీరో నాగ‌శౌర్య మాట్లాడుతూ, ` అమ్మ‌మ్మ‌గారిల్లు ఒక గుడిలాంటింది. గుడికి వెళ్లిన‌ప్పుడు శ‌త్రువులు ఎదురైనా ద‌ర్శ‌నం చేసుకుని వ‌స్తాంగానీ..అలాంటి చోట త‌గాదాలు ప‌డం. అలాగే అమ్మ‌మ్మ‌గారి ఇంటికెళ్లిన‌ప్పుడు  కుటుంబంలో వ్య‌క్తుల మ‌ధ్య‌ మ‌నస్ఫ‌ర్ధ‌లున్నా బ‌య‌ట‌కి న‌వ్వుతూ ఉంటాం. కార‌ణం అమ్మ‌మ్మ బాధ‌ప‌డ‌కూడ‌ద‌ని. అలాంటి పాత్ర‌ల‌తో చిత్రీక‌రించిన సినిమా ఇది. నాకు మా అమ్మ‌మ్మ ఇంటితో చాలా అనుబంధం ఉండేది. మ‌ళ్లీ ఆ జ్ఞాప‌క‌ల‌న్నీ ఈ సినిమా గుర్తుచేసింది. సినిమా బాగా వ‌చ్చింది. ఇవి రేటింగ్ ఇచ్చే సినిమాలు కావు. ద‌య‌చేసి ఎవ‌రూ ఈ సినిమాకు రేటింగ్స్ ఇవ్వొద్ద‌ని కోరుకుంటున్నా. సుంద‌ర్, ర‌సూల్ మంచి టెక్నీషియ‌న్లు. సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. షామిలీ మంచి కోస్టార్. ఆమె 15 ఏళ్ల క్రిత‌మే న‌టిగా నిరూపించుకున్నారు. ఆమె గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. నిర్మాత‌లు చాలా ఫ్యాష‌న్ తో సినిమా చేశారు.  సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు సుంద‌ర్ సూర్య మాట్లాడుతూ, ` వినాయ‌క్ గారికి నేనే ఎవ‌రో తెలియ‌దు. ఫోన్ చేయ‌గానే  మా సినిమా టీజ‌ర్ ఆవిష్క‌ర‌ణ‌కు పిల‌వ‌గానే వ‌స్తాన‌న్నారు. నిజంగా వేరే ఎవ‌రైనా అయితే రారు. అందుకు ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు. ద‌ర్శ‌కుడిగా నాకిది తొలి సినిమా.    
నా జీవితంలో చోటుచేసుకున్న కొన్ని జ్ఞాప‌కాల‌తో సినిమా చేశాను. న‌టీన‌టులంతా  బాగా న‌టించారు. మంచి సంగీతం కుదిరింది. సాయి కార్తీక్ ఆర్ ఆర్ బాగా అందించారు.  నాగశౌర్య లేక‌పోతే ఈ సినిమా లేదు.  ఆయ‌న న‌న్ను, నా కథ‌ను  న‌మ్మి సినిమా చేయ‌డం అదృష్టం గా భావిస్తున్నా. ఆయ‌న పాత్ర క‌న్నీరు పెట్టిస్తుంది. మా నిర్మాత‌లు చ‌క్ర‌పాణి-నాగిరెడ్డి లా క‌లిసి ఎన్నో సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
 
నిర్మాత రాజేష్ మాట్లాడుతూ, `తెలుగు ఆడియ‌న్స్  అంద‌రికీ న‌చ్చే క‌థ ఇది. ప్ర‌తీ ఒక్క‌రికి క‌నెక్ట్ అవుతుంది. సుంద‌ర్ సినిమా బాగా తీశారు. న‌టీన‌టులంతా చ‌క్క‌గా న‌టించారు. ముఖ్యంగా నాగ‌శౌర్య‌, షామిలి త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. సినిమా అందిరికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది` అని అన్నారు.
 
స‌హ నిర్మాత కుమార్ మాట్లాడుతూ, ` టైటిల్ ఎంత బాగుందో సినిమా అంత‌కు మించి బాగుంటుంది. నాగ శౌర్య‌తో సినిమా చేయ‌డం చాలా సంతోష‌గా ఉంది. సినిమా బాగా వ‌చ్చింది. తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ న‌చ్చే సినిమా ఇది` అని అన్నారు.
 
న‌డుటు శివాజీ రాజా మాట్లాడుతూ,` వినాయ‌క్ గారు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారు. ఆ విష‌యంలో ఆయ‌న్ను చూసి నేర్చుకోవాల్సిందే. సినిమా షూటింగ్ అంతా పండ‌గ వాతావ‌ర‌ణంలా జ‌రిగింది. కార్వాన్లు ఉన్నా అంతా చెట్టుకింద కూర్చొని ఒకే కుటుంబంలా క‌లిసి పనిచేసాం. రావు ర‌మేష్ గారి పాత్ర చాలా బాగుంటుంది. అలాగే హీరో నాగ‌శౌర్య కు మ‌రో హిట్ సినిమా అవుతుంది. డైరెక్ట‌ర్ సుంద‌ర్ ప‌నిత‌నం ప్ర‌శంస‌నీయం. ఆణిముత్యంలాంటోడు. మంచి క‌థ‌తో ప‌రిచ‌యం అవుతున్నాడు. చ‌క్క‌ని కుటుంబ క‌థా చిత్రమిది. అంద‌రికీ న‌చ్చుతుంది. నిర్మాత‌లు మ‌మ్మ‌ల్ని అంద‌ర్నీ ఒకే కుటుంబంలా చూసుకున్నారు. వాళ్లు ఇదే బ్యాన‌ర్లో మ‌రిన్ని పెద్ద సినిమాలు చేయాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా` అని అన్నారు.
 
న‌టుడు రావు రమేష్ మాట్లాడుతూ, ` నాగ‌శౌర్య సినిమాల్లో ఆయ‌న‌తో పాటు మిగ‌తా న‌టీన‌టులంద‌రికీ కూడా ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటుంది. అదే ఆయ‌న సినిమాల్లో ప్ర‌త్యేక‌త‌. ఈ సినిమాలో అన్నీ పాత్ర‌లు వేటిక‌వి పండుతాయి. సినిమా విజ‌యం మంచి విజ‌యం సాధించి ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు మంచి పేరు తీసుకురావాలి` అని అన్నారు.
 
న‌టి హేమ మాట్లాడుతూ, ` చిన్న‌ప్పుడు అమ్మమ్మ‌గారిల్లు ఎలా ఉంటుందో తెలియ‌దు.  ఆ అనుభుత‌ల్నిఈ సినిమా అందించింది. మంచి పాత్ర‌లు రావ‌డం లేదు? అనుకుంటోన్న స‌మ‌యంలో సుంద‌ర్ క‌థ చెప్ప‌డంతో వెంట‌నే ఒకే చెప్పాసా. న‌వ‌ర‌సాలు ఉన్న పాత్ర నాది. హీరో, హీరోయిన్ల‌కు ఎంత మంచి పేరు వ‌స్తుందో? నా పాత్ర‌కు అంత మంచి పేరు వ‌స్తుంది.  నాగ‌శౌర్య త‌న భుజాల‌పై  వేసుకుని సినిమా చేశాడు. సుంద‌ర్ ప్రాణం  పెట్టి సినిమా చేసాడు. సినిమా పెద్ద విజయం సాధిస్తుంది` అని అన్నారు.
 
ఛాయాగ్రాహ‌కుడు ర‌సూల్ మాట్లాడుతూ, ` 30 ఏళ్ల‌గా సినిమా ఇండ‌స్ర్టీలో ఉంటున్నాను. నా పాత రోజుల్ని ఈ సినిమా గుర్తిచేసింది. సినిమా బాగా వ‌స్తోంది. పెద్ద స‌క్సెస్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది` అని అన్నారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో  ఏడిద శ్రీరామ్, ర‌వి ప్ర‌కాష్, దుర్గా ర‌మేష్, జె.పి, సురేష్ కోండేటి, మ‌ధుమ‌ణి, రూప‌ల‌క్ష్మి త‌దిత‌రులు పాల్గొన్నారు.

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.