Updated: 12-04-2018 10:26:33
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఫిలిం ఛాంబర్, డైరెక్టర్స్ అసోసియేషన్, `మా` అసోసియేషన్ పెద్దలు వర్ధమాన నటి శ్రీరెడ్డి విషయాన్ని పున పరిశీలించమని సలహా ఇచ్చారని `మా` అధ్యక్షుడు శివాజీ రాజా గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలించే వరకూ శ్రీరెడ్డి తో `మా` సభ్యులు యధాతధంగా పనిచేయవచ్చని శివాజీ రాజా ప్రకటించారు. అలాగే `మా` లో సభ్యత్వ విషయమై కమిటీ సభ్యులు, మెంబర్లంతా సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో సెక్సువల్ హేరెస్ మెంట్ మీద జరుగుతోన్న విమర్శల పరిణామాన్ని సీరియస్ గా తీసుకున్న తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫర్ కామర్స్ వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో విశాఖ గైడ్ లైన్స్ పేరుతో ఇచ్చిన గైడ్ లైన్స్ ఆధారంగా ఓ కమిటీ ని ఏర్పాటు చేయాలని దీనిలో సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, ఫెడరేషన్ మెంబర్స్ తో పాటు తో పాటు సమాజంలో ఉన్న అందరి ప్రముఖుల్ని (లాయర్లు, డాక్టర్లు, ప్రభుత్వాధికారులు) ఇందులో మెంబర్స్ గా ఉంటారని ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు పి. కిరణ్ తెలిపారు. గవర్నమెంట్ వారి గైడ్ లైన్స్ ప్రకారం ప్రతీ ప్రొడక్షన్ కంపెనీలో లైంగిక వేధింపుల నియంత్రణ కోసం క్యాష్(కమిటీ అగైన్‌స్ట్ సెక్సువల్ హెరాస్‌మెంట్) ఉండి తీరాలని క్యాష్ కమిటీని ఏర్పాటు చేసేలా ఫిల్మ్ ఛాంబర్ బాధ్యత తీసుకుంటుందని ఛాంబర్ అధ్యక్షుడు పి. కిరణ్ తెలిపారు.
షేర్ :
తాజా వార్తలు