మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఎడ్యుకేషన్ న్యూస్

తెలంగాణ గురుకులాల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ మొద‌లు.. తొలిగంట‌లోనే 130..

Updated: 18-02-2017 06:01:14

హైద‌రాబాద్‌: తెలంగాణ గురుకుల సొసైటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో ఐదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. రాష్ట్రంలోని 507 గురుకులాల్లో 40,600 సీట్ల భ‌ర్తీకి ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హిస్తున్నారు. మార్చి 16వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు. శుక్ర‌వారం ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్రారంభ‌మైన గంట‌లోనే 130 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.30 చెల్లించాలి. ఏప్రిల్ 9న ప్ర‌వేశ ప‌రీక్ష జ‌రుగుతుంద‌ని, ఏమైనా ఇబ్బందులు ఎదురైతే సంబంధిత గురుకుల పాఠ‌శాల‌ల్ని సంప్ర‌దించాల‌ని తెలంగాణ గురుకుల ప్ర‌వేశ ప‌రీక్ష క‌న్వీన‌ర్ ప్ర‌వీణ్‌కుమార్ తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఆధ్వ‌ర్యంలోని ఐఐటీ సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల్లో ప్ర‌వేశానికి ఎంపికైన విద్యార్థుల జాబితాను వెబ్‌సైట్లో పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు.

షేర్ :

మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.