మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఎడ్యుకేషన్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Updated: 24-11-2017 02:33:14

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పాత పది జిల్లాల ప్రాతిపదికనే నోటిఫికేషన్ ఉండాలని, పాత పది జిల్లాల ప్రాతిపదికనే జీవోను విడుదల చేయాలని హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించి జీవో 25ను సవరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్‌ను రూపొందించి విడుదల చేయనుంది. వాస్తవానికి కేసీఆర్ సర్కారు ఇటీవలే 31 జిల్లాల ప్రాతిపదికన టీఆర్టీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 8792 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు జీవో నెంబర్ 25ను సవరించనున్నారు. 
 
పాత టిఆర్‌టి నోటిఫికేషన్ ఇదే 
స్కూల్‌ అసిస్టెంట్ పోస్టులు 1941,
 
పీఈటీ పోస్టులు 416..
 
స్కూల్‌ అసిస్టెంట్‌(ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) పోస్టులు 9..
 
లాంగ్వేజ్‌ పండిట్ పోస్టులు 1011,
 
ఎస్జీటీ పోస్టులు 5415
 
జిల్లాల వారీగా మొత్తం టీచర్‌ పోస్టులు
 
ఆదిలాబాద్‌ 293, మంచిర్యాల 169, నిర్మల్‌ 226 పోస్టులు ఆసిఫాబాద్ జిల్లాలో 894 టీచర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 
 
కరీంనగర్‌ 71, జగిత్యాల 253 పోస్టులు, పెద్దపల్లి 53, సిరిసిల్ల 76 నిజామాబాద్ 158, కామారెడ్డి జిల్లాలో 381 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
 
వరంగల్‌ అర్బన్ 22, వరంగల్‌ రూరల్‌ 23, భూపాలపల్లి 319 పోస్టులు జనగాం 60, మహబూబాబాద్‌ జిల్లాలో 128 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 
 
ఖమ్మం 57, భద్రాద్రి జిల్లాలో 185 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 
 
మెదక్‌ 281, సంగారెడ్డి 903, సిద్దిపేట జిల్లాలో 101 పోస్టులు మహబూబ్‌నగర్ 731, వనపర్తి 154, నాగర్‌కర్నూలు 385, గద్వాల 438, నల్గొండ 190, సూర్యాపేట 156, యాదాద్రి జిల్లాలో 128 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 
 
వికారాబాద్ 820, మేడ్చల్‌ 199, రంగారెడ్డి జిల్లాలో 521 పోస్టులు హైదరాబాద్‌లో 417 టీచర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
 
హైకోర్టు తీర్పు నేపథ్యంలో సాయంత్రం డిప్యూటీ సీఎం కడియం సమావేశం నిర్వహించనున్నారు. 
 
విద్యాశాఖ, న్యాయ నిపుణులతో సమావేశం కానున్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేయాలా లేక అమలు చేయాలా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. 

షేర్ :

మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.