మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఎడ్యుకేషన్ న్యూస్

త్వరలో యూనివర్సిటీ ఖాళీ పోస్టుల భర్తీ

Updated: 13-02-2017 04:51:37

హైదరాబాద్: త్వరలో యూనివర్సిటీల్లోని ఖాళీ  పోస్టులు భర్తీ కానున్నాయి. వీలైనంత త్వరగా వాటిని భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయించినట్టు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విద్యకు అత్యంత ప్రాధాన్యం  ఇస్తూ రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా అన్నెపర్తిలో మహాత్మాగాంధఈ యూనివర్సిటీలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం సెంట్రల్ లైబ్రరీని ప్రారంభించిన కడియం మాట్లాడుతూ త్వరలోనే యూనివర్సిటీల్లోని ఖాళీ పోస్టులు భర్తీ కానున్నట్టు వివరించారు.  

షేర్ :

మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.