మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఎడ్యుకేషన్ న్యూస్

విద్యార్ధులు ఎంపిక చేసిన టీచర్లకు నేష‌న్ బిల్డ‌ర్ అవార్డులు

Updated: 19-09-2017 12:16:23

హైదరాబాద్: ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో డ్రాప్ అవుట్స్ త‌గ్గించి, తమ బోధనతో విద్యార్ధులను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు రోటరి క్ల‌బ్ ఆఫ్ హైద‌రాబాద్ నేష‌న్ బిల్డ‌ర్ అవార్డులను ప్ర‌దానం చేసింది. కూక‌ట్‌ప‌ల్లి గోదాకృష్ణ  గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ విద్యాశాఖ మంత్రి మండ‌వ వెంక‌టేశ్వ‌రరావు చేతుల మీదుగా నేష‌న్ బిల్డ‌ర్ అవార్డుల‌కు ఎంపికైన ఉపాధ్యాయులంద‌రీకి స‌న్మానం, ప్ర‌శంస ప‌త్రం అందచేశారు. ఆయా పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్నవిద్యార్ధుల అభిప్రాయ‌లకు అంతిమ ప్రాధాన్యం ఇస్తూ అవార్డుల‌కు  టీచ‌ర్ల‌ను ఎంపిక చేయ‌డం చేశారు. తాము అవార్డులకు ఎంపిక చేసిన టీచర్లందరూ తమ బోధన ద్వారా విద్యార్ధుల హృదయాలు గెలుచుకున్నవారని రోట‌రి క్ల‌బ్ లిట‌ర‌సి క‌మిటి అధ్య‌క్షురాలు ఉషారాణి చెప్పారు. నేష‌న్ బిల్డ‌ర్ అవార్డు అందుకున్న ఇంగ్లీష్ టీచర్ ఆరేపాటి మీనాక్షి మాట్లాడుతూ తమపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. అవార్డు పాఠశాల విద్యార్ధులకే అంకితమని చెప్పారు. 

షేర్ :

మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.