మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఎడ్యుకేషన్ న్యూస్

ప్రపంచాన్ని ఆనందంగా మార్చాలనుకుంటున్నారా?

Updated: 04-05-2017 01:16:42

వరంగల్: బయట ప్రపంచాన్ని బాగు చేయడం కన్నా మనల్ని మనం పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చి దిద్దుకోవడం ఎంతో మంచిది. కోపాలకు, అనవసరపు ఆవేశాలకు, అసూయలకు, అతి ఆలోచనలకు, అత్యాశలకు, వెర్రి వ్యాపకాలు, వ్యర్ధమైన కలలకు, మనల్ని మనం దూరంగా ఉంచుకునేందుకు కృషి చేయడం ఎంతోమంచిది. ఒక లక్ష్యాన్నిఎంచుకుని దానికోసం అహర్నిశలు కృషిచేయడం చాలా ఉత్తమం. ప్రతి మనిషికి అంతర ప్రపంచం మనసు లోపల ఉంటుంది. ఇక బయటవుండే పరిసరాలు, పరిస్థితులు ఇవన్నీ బాహ్య వాతావరణం. వ్యక్తిపై అతని మానసిక వికాసాదశపై, ఆలోచనలపై ఈ రెండు వాతావరణాల ప్రభావం ఉంటుంది . 
       వ్యక్తి మనస్తత్వం, మూర్తిమత్వం తయారయ్యేది ఈ ప్రభావం ఆధారంగానే. బాహ్య వాతావరణాన్ని అధిగమించి, అంతర్ వాతావరణం చెప్పినట్లు నడుచుకోగలిగితే మనిషి వ్యక్తిత్వం పరిపక్వముగా, సానుకూలంగా చెప్పినట్లు నడుచుకోగలిగితే మనిషి వ్యక్తిత్వం పరిపక్వముగా, సానుకూలంగా, సక్రమంగా రూపొందించగలడు. మనలోని దుర్లక్షణాలను కూడా మనం స్పోర్టివ్‌గా తీసుకోగలగాలి. లేకుంటే వాటిని అధిగమించలేము.
          మనతప్పుల్ని మనం ఒప్పుకోగల గుండెధైర్యం మనకుండాలి. అలాగని అవతలివాళ్ళు మన మానసిక బలహీనతలని ఆసరాగా చేసుకొని మనల్ని బలిపశువుల్ని  చేయడానికీ ప్రయతిస్తున్నపుడు కూడా తప్పుల్ని, చేయని నేరాల్ని తలకెక్కించుకొనవసరం లేదు. ఈ పరిస్థితిలోకూడా సాధ్యమైనంతవరకు వాదనకు స్వస్తిపలడం మంచిది. 
         ప్రపంచాన్ని ఆనందంగా మార్చాలనుకుంటున్నారా ? ఏంలేదు మనసు  చూసే దృక్కోణాన్ని  మీ వైఖరులను , ఆలోచనా విధానాల్ని ఆనందంగా ఉంచుకోండి చాలు   ప్రపంచం దానంతట అదే ఆనందమయంగా కనిపిస్తుంది . మీకు మరీ ఆలస్యం ఎందుకు మీ ప్రయత్నాల్ని , ఆచరణలను , ఆలోచనలోపెట్టండి . ఆలా ప్రయత్నం సాగిస్తారని ఆశిస్తూ 
----డాక్టర్ గాదె మోహన్, MSc(psy), MA(soc), MA(phil), LLB, PhD  

షేర్ :

మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.