మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఎడ్యుకేషన్ న్యూస్

కవితతో నివాళి అర్పించిన సినారె శిష్యుడు డాక్టర్ మౌని

Updated: 13-06-2017 07:14:07

తిరుపతి: డాక్టర్ సి.నారాయణ రెడ్డి కన్నుమూతతో ఆయనకు సన్నిహితులు, శిష్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అనేకమంది సాహితీవేత్తలు, కవులు తమ కవితలు, పాటలతో సినారెకు నివాళులర్పిస్తున్నారు. సినారెకు సన్నిహితుడైన సాహితీవేత్త, కవి డాక్టర్ మౌని తన కవితతో సినారెకు నివాళులర్పించారు. 
 
కవితా సిరి..సినారె
........................
 
పేరులోన ఊరిలోన పెన్నిధి సిరిదాగుంది..
పద్మభూషణ్ అన్న బిరుదు పండితునికి బాగుంది
కదిలే సాహితీశిఖరంకదా...సినారె మహోదయా..                                  
 జ్ఞానపీఠ పురస్కారం జ్ఞాపికగా ......బాగుంది.                     
  
.పలికే పదకవితల్లో....ప్రాణంవుంది.    .
పలకరించు మాటల్లో గానంవుంది.   
తరాలు అంతరాలు ఎలుగెత్తిన కంఠంలో ఎంతహాయి సినారె.  
సంగీతం కలగలసిన కవితల్లో..సుజ్ఞానం వుంది.   
 
పాటలకోటలై పుడతారు కొందరు.     
మాటలతో పుస్తకాల పుటలయ్యేదెందరు ...                             
కావ్యహ్రుదయ పుష్పం. విశ్వంభరగా పరిమళించె.  సినారె.   
పుట్టుకతోనే. కవిరాజని ప్రశంసించిరందరు
 
ఎక్కిన ఎత్తులు మాత్రం చూస్తున్నాము
మీ పాండిత్యపు లోతుల్లో మునకేస్తున్నాము 
ఏకవీరమీటి ఎదలు శృతిచేసిన కవివైనిక సినారె
ఆ కవితా గానంలో తడిసి పులకిస్తున్నాము
 
పాటలో ఏముందని పలవరించు పదబంధం
మాటలోని మధురమంతా పాటైతైనే అందం 
ఎప్పుడైనా ఎక్కడైనా సాహిత్యం వేదికైతే సినారె
పథితుల హృదయాలపైన పరిమళించు సుమగంధం 
---- డాక్టర్ మౌని

షేర్ :

మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.