మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఎడ్యుకేషన్ న్యూస్

నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలకు సంస్కృత కేంద్రం కేటాయింపు

Updated: 01-08-2017 11:34:03

హైదరాబాద్: సంస్కృత భాష వ్యాప్తి కోసం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సంస్కృత సంస్థానం ద్వారా హైదరాబాద్‌లోని జి.నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలకు సంస్కృత కేంద్రం కేటాయించారు. దేశంలోని ఉన్నత విశ్వవిద్యాలయాల్లో సంస్కృత కేంద్రాలను  ఏర్పాటు చేయడంలో భాగంగా దీన్ని జి.నారాయణమ్మ కళాశాలలో ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన బెంగళూర్ రాయ్ టెక్నాలజీ ప్రొఫెసర్ శ్రీనివాసన్ మాట్లాడుతూ సంస్కృత భాష గొప్పతనాన్ని వివరించారు. వేల ఏళ్ల క్రితమే భారతీయ ఆచార్యులు అనేక వైజ్ఞానిక ఆవిష్కరణలు చేశారని చెప్పారు. సంస్కృత భాషలో ప్రతి పదానికీ ఉన్నతమైన అర్థాలున్నాయని వివరించారు. యోగాకు మూలం కూడా సంస్కృతమేనని, సంస్కృతాన్ని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలని సూచించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సంస్కృత సంస్థాన్ కో ఆర్డినేటర్ వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంస్కృత భాష విశిష్టతను తెలియజేశారు. నేడు అనేక దేశాల్లో సంస్కృతం తప్పనిసరి సబ్జెక్ట్‌గా మారిందని వివరించారు. రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ అధ్యయన కేంద్రం ద్వారా విద్యార్ధులే కాదు సంస్కృతం నేర్చుకోవాలనుకునేవారంతా తమకు అనువైన సమయంలో నేర్చుకోవచ్చని కళాశాల కో ఆర్డినేటర్, ప్రొఫెసర్ గోపీనాథ్ చెప్పారు. పూర్తి వివరాలకు 9010156101, 8313401956 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రమేశ్రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రామలింగారెడ్డి, సంస్కృత శిక్షిక కె.రూప, కళాశాలలోని అన్ని విభాగాల ప్రొఫెసర్లు, విద్యార్ధినులు, సంస్కృత భారతి ప్రతినిధి సంజీవ పాల్గొన్నారు.     

షేర్ :

మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.