మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఎడ్యుకేషన్ న్యూస్

ఏపీ టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Updated: 09-11-2017 10:57:07

అమరావతి: 2017-18 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మార్చి 15, 2018 నుంచి ప్రారంభ‌మ‌వుతాయి. అదే నెల 29 వ‌ర‌కు ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. ఈ ఏడాది మొత్తం 6,36,831 మంది విద్యార్థులు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్నారు. ఇందులో బాలురు 3,08,834 మంది కాగా బాలిక‌లు 3,27,997 మంది. మొత్తం ప‌రీక్షా కేంద్రాలు సుమారు 2850. ఈ సెంట‌ర్ల‌లో ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. ప‌రీక్ష‌లు ముగియ‌గానే మార్చి 30 నుంచి వాల్యుయేష‌న్ ప్రారంభమ‌వుతుంది. ఏప్రిల్ 14. 2018 క‌ల్లా వాల్యుయేష‌న్ పూర్త‌వుతుంది. మే మొద‌టి వారంలో ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల చేస్తామని విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యంగా గ‌త ఏడాది ... 6,09,502 మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాయ‌గా.. ఈ ఏడాది 6,36, 831 మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాయ‌నున్నారు. అంటే గత  ఏడాది కంటే ఈ విద్యా సం. 27,329 మంది విద్యార్థులు ఎక్కువ‌గా ప‌రీక్ష‌కు హాజ‌రు కానున్నారు. 2016- 2017 విద్యా సంవత్సరంలో మార్చి 17 న ప్రారంభ‌మై... ఏప్రిల్ 1 న ముగిశాయి.
 
 

షేర్ :

మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.