మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు రెండో స్వర్ణం
Updated:
06-04-2018 09:14:43
గోల్డ్ కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్ 2018లో మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో సంజితా చాను స్వర్ణాన్ని సాధించింది. 53 కేజీల విభాగంలో మొత్తం 195 కేజీల బరువు ఎత్తి ఆమె ఈ ఘనత సాధించారు. నిన్న మీరాబాయ్ చాను 46 కేజీల విభాగంలో మొత్తం 196 కేజీల బరువు ఎత్తి స్వర్ణం సాధించారు.