పెళ్లిలో గులాబీ రంగు చీరలో మెరిసిపోయిన శ్రియ
Updated:
20-03-2018 10:37:41
ముంబై: సినీ నటి శ్రియ పెళ్లైంది. రష్యాకు చెందిన ఆండ్రీ కోస్ చీవ్‌ను శ్రియ వివాహమాడారు. ముంబైలోని అంధేరీలో ఉన్న తన ఇంట్లోనే మార్చి 12న వివాహం జరిగింది. శ్రియా పెళ్లి ఉదయ్ పూర్లో అంగరంగ వైభవంగా జరుగనుందని మొదట వార్తలు వచ్చాయి. ఈ పెళ్లికి శ్రియ తరుపు బంధువులు, ఆండ్రీ తరపు బంధువులు మాత్రమే హాజరయ్యారు. సినిమా ఇండస్ట్రీ నుంచి మనోజ్ బాజ్ పేయ్, షబానా ఆజ్మీ వచ్చారు. ఇంట్లోనే ఎలాంటి హంగామా లేకుండా శ్రియ పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది.
శ్రియ పెళ్లి హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగింది. పెళ్లిలో శ్రియ గులాబీ రంగు చీరలో మెరిసిపోయింది. మార్చి 11న ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 18 సంవత్సరాలుగా శ్రియ సినిమాలలో నటిస్తోంది. 37 ఏళ్ల వయసులో ఇప్పుడు పెళ్లి కూతురైంది. రష్యన్ క్రీడాకారుడు, రెస్టారెంట్లకు యజమాని అయినా ఆండ్రీ శ్రియ మధ్య ప్రేమ ప్రయాణం చాలా కాలంగా సాగుతోంది. కానీ ఆ విషయం గురించి వారిద్దరూ ఎక్కడా నోరు విప్పలేదు.