మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       వెరీ స్పెషల్ న్యూస్

నెంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన మిథాలీ

Updated: 18-02-2018 11:15:15

దుబయ్: భారత మహిళా క్రికెట్ జట్టుకు సారధ్యం వహిస్తోన్న మిథాలీ రాజ్‌ నెంబర్ వన్ ర్యాంక్ కోల్పోయారు. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకుల ప్రకారం ఆమె మూడో ర్యాంక్‌కు పరిమితమయ్యారు. తొలి ర్యాంక్‌ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎల్లెసీ పెర్రీకి దక్కింది. పెర్రీ తన కెరీర్‌లో మొదటి సారి నెంబర్ వన్ ర్యాంక్ సాధించింది. రెండో స్థానంలో ఆస్ట్రేలియాకే చెందిన స్కిప్పర్ మెగ్ లాన్నింగ్‌ నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే పోరులో మిథాలీ సరైన ప్రదర్శన కనబరచకపోవడంతో ఆమె ర్యాంక్ మూడో స్థానానికి పడిపోయింది. సిరీస్ భారత్ గెలుచుకున్నా మిథాలీ మూడు వన్డేల్లో 70, 20, 4 స్కోర్లు మాత్రమే చేయగలిగింది. మిథాలీ గత అక్టోబర్‌లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. మరోవైపు భారత్‌కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ కూడా రెండు ర్యాంకులు పడిపోయింది. ప్రస్తుతం ఆమె ర్యాంక్ ఏడో స్థానంలో ఉంది. స్మృతీ మంధన ర్యాంక్ ఇంప్రూవ్ అయింది. ఇక బౌలర్ల విషయానికి వస్తే మహిళా క్రికెట్‌లో 200 వికెట్లు తీసి సంచలనం సృష్టించిన క్రీడాకారిణిగా పేరు తెచ్చుకున్న జులన్ గోస్వామి రెండో ర్యాంక్‌లో నిలిచింది. తొలి ర్యాంక్ దక్షిణాఫ్రికాకు చెందిన మేరిజన్‌కు దక్కింది. 

షేర్ :

మరిన్ని వెరీ స్పెషల్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.