మేము సైతం రెండో సీజన్ ఈనెల 18నుంచి షురూ
Updated:
15-02-2018 12:40:38
హైదరాబాద్: మంచు లక్ష్మీ యాంకర్‌గా నిర్వహిస్తున్న మేము సైతం సినిమా రెండో సీజన్ జెమినీ టీవీలో ఈ నెల 18 నుంచీ ప్రారంభం కానుంది. కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు, యువరత్న నందమూరి బాలకృష్ణ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, అనుష్క, సాయి పల్లవి, వివిఎస్ లక్ష్మణ్ తదితర ప్రముఖులు మేము సైతం రెండో సీజన్లో దర్శనమివ్వనున్నారు. ఫిబ్రవరి 18 నుంచి ప్రతి ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఈ షో ప్రసారం కానుంది.