మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆధ్యాత్మికం న్యూస్

శ్రీ కపిలేశ్వరాలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

Updated: 08-07-2017 11:51:19

తిరుపతి: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శుక్రవారం మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఉదయం మూలవర్లకు అభిషేకం, మహాపూర్ణాహుతి, పవిత్ర సమర్పణ నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీపనైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం 6.30 గంటల నుండి 9.00 గంటల వరకు పంచమూర్తులైన శ్రీసోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, వళ్లి దేవసేన సమేత శ్రీసుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివారి వీధి ఉత్సవం ఘనంగా జరుగనుంది. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో  సుబ్రమణ్యం, సహాయ కార్యనిర్వహణాధికారి శంకర్‌రాజు, ఆలయ అర్చకులు స్వామినాథన్‌ స్వామి,  మణిస్వామి, ఉదయస్వామి, సూపరింటెండెంట్‌ ఓబుల్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్స్‌పెక్టర్లు నారాయణ, మురళీక ష్ణ ఇతర అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

షేర్ :

మరిన్ని ఆధ్యాత్మికం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.