మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

ఎన్టీఆర్ పాత్రలో నటించే అవకాశం రావడం నా అదృష్టం : బాలయ్య

Updated: 29-03-2018 11:35:46

ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రారంభం సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి పేరిట బయోపిక్ తీయగలగడం తన పూర్వజన్మ అదృష్టమని చెప్పారు.
 
బాలయ్య ఇంకా ఏమన్నారంటే!
 
ఎన్టీఆర్ చరిత్ర శాశ్వతంగా నిలిచిపోవాలి. భావి తరాలకి అనే ఒక తలంపుతో ఈ చిత్రాన్ని ప్రారంభించాము.. విష్ణు గారు ఈ ఆలోచనతో రావడం, సాయి కొర్రపాటి గారు ముందుకొచ్చారు...ఎన్టీఆర్ పాత్రలో నటించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. 
 
కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దర్శకుడు రాఘవేంద్రరావు, నటి జమున, సినీ నటుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం కీరవాణి అందిస్తున్నారు. మాటలు బుర్రా సాయి మాధవ్ రాస్తున్నారు. 

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.