నాగార్జున క్లాప్‌తో ప్రారంభమైన అఖిల్-వెంకీ చిత్రం
Updated:
27-03-2018 07:53:45
యూత్‌కింగ్ అఖిల్ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై తొలి సినిమా 'తొలిప్రేమ'తో సూపర్ హిట్ సాధించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.25గా ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. దేవుని పటాలకు నమస్కరిస్తున్న అఖిల్‌పై ఫస్ట్ షాట్‌ను చిత్రీకరించారు. ఈ ఫస్ట్‌షాట్‌కి కింగ్ నాగార్జున క్లాప్ నివ్వగా, హీరో దుల్కర్ సల్మాన్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ ప్రారంభోత్సవానికి అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాజరయ్యారు. మే నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్, సంగీతం: థమన్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఎడిషనల్ స్టోరీ, ఛీఫ్ అసోసియేట్ డైరెక్టర్: సతీష్ చంద్ర, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వెంకీ అట్లూరి.