మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

ఇకపై అన్ని ఫంక్షన్స్‌లో ట్రెండ్‌ మారుద్ది -సూపర్‌స్టార్‌ మహేశ్‌

Updated: 08-04-2018 02:47:48

సూపర్‌స్టార్‌ మహేశ్‌, డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంప దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా బ‌హిరంగ స‌భ హైదరాబాద్‌ ఎల్‌.బి.స్టేడియలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్‌కి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులతో ఎల్‌.బి.స్టేడియం కిక్కిరిసిపోయింది. భారీ అభిమాన సందోహం మధ్య జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ కార్యక్రమానికి విచ్చేసిన సూపర్‌స్టార్‌ కృష్ణ మేకింగ్‌ ఏవీని విడుదల చేశారు. థియేట్రికల్‌ ట్రైలర్‌ను యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ విడుదల చేశారు. 
 
మా అమ్మ‌గారి పుట్టిన‌రోజు సినిమా రిలీజ్ కావ‌డం ఆనందంగా ఉంది-సూపర్‌స్టార్‌ మహేశ్‌ 
 
 
సూపర్‌స్టార్‌ మహేశ్‌ మాట్లాడుతూ - ''ఇది ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లా అనిపించడం లేదు. వందరోజుల వేడుక చూస్తున్నట్లుంది. తారక్‌ ఆది సినిమా ఆడియో ఫంక్షన్‌కి వెళ్లాను. ఇప్పుడు తారక్‌ నా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి వచ్చాడు. తనకు థాంక్స్‌. ఇకపై అన్ని ఫంక్షన్స్‌లో ట్రెండ్‌ మారుద్ది. అందరూ హీరోలు అన్ని ఫంక్షన్స్‌కి వెళతారు. మన ఇండ్సస్ట్రీలో ఉన్నది ఐదారుగురు పెద్ద హీరోలు మాత్రమే తిప్పికొడితే ఏడాదికి ఒక సినిమానే చేస్తాం. అందరూ సినిమాలు ఆడితే ఇండస్ట్రీ బాగా ఉంటుంది. మేం మేం బాగానే ఉంటాం. మీరే బాగా కావాలి.. బాగుండాలి. సినిమా విషయానికి వస్తే శివగారికి థాంక్స్‌ చెప్పాలి. కథ చెప్పేటప్పుడు నా క్యారెక్టర్‌ని సీఎం అని చెప్పగానే నాకు భయమేసింది. ఎందుంకటే నాకు, రాజకీయాలకు సంబంధం లేదు. వాటి గురించి పట్టించుకోను. దూరంగా ఉంటాను. అలాంటిది సీఎం అంటున్నారేంటనిపించి చిన్న వణుకు వచ్చింది. షూటింగ్‌ చేసేటప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటి వరకు నా ఫైనెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఈ సినిమాలోనే చేశాను. శ్రీమంతుడు సినిమా నా కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌. మళ్లీ అదే టర్నింగ్‌ పాయింట్‌ మళ్లీ వచ్చింది. మళ్లీ భరత్‌ అనే నేను రాబోతుంది. అది కూడా శివగారే ఇచ్చారు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. దానయ్యగారు ఎప్పుడూ సినిమాను గ్రాండ్‌గా ఉండాలనుకుంటారు. ఆయన కోరినట్లే సినిమా గ్రాండ్‌గా ఉంటుంది. నేను దేవిశ్రీకి పెద్ద ఫ్యాన్‌ని. మొన్ననే రంగస్థలం చూశాను. రెండింటికి డిఫరెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. ఇరవై రోజుల గ్యాప్‌లో అంత మంచి మ్యూజిక్‌ ఎలా చేయగలిగాడనిపించింది. భరత్‌ అనే నేను థీమ్‌ మ్యూజిక్‌, వచ్చాడయ్యో సామి అనే సాంగ్స్‌ నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ సాంగ్స్‌ అని అనుకుంటున్నాను. రామజోగయ్యగారికి ఈ సినిమాతో అవార్డు రావాలి. రామ్‌లక్ష్మణ్‌ మాస్టర్స్‌కి థాంక్స్‌. ఏప్రిల్‌ 20న మా అమ్మగారు ఇందిరమ్మగారి పుట్టినరోజు. అమ్మగారి ఆశీస్సుల కంటే..గొప్పదేమీ లేదు. ఆరోజున సినిమా రిలీజ్‌ కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో లవ్‌స్టోరీ చాలా ఇంపార్టెంట్‌. కొత్త అమ్మాయి అయితే బావుంటుందనిపించింది. తను అద్భుతంగా నటించింది. తనతో మళ్లీ పనిచేయాలని అనుకుంటున్నాను. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌'' అన్నారు. 
 
ఈ కార్యక్రమంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రాఫర్స్‌ రవి.కె.చంద్రన్‌, తిరునావ్‌కరసు, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సురేశ్‌, తదితరులు పాల్గొని యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.