ఎన్టీవీ చౌదరిని టీవీ9 చౌదరి అని సంభోదించి నవ్వేసిన రామ్ చరణ్
Updated:
14-04-2018 01:10:31
హైదరాబాద్: రంగ స్థలం సక్సెస్ మీట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ బాబాయ్ పవన్ కళ్యాణ్ థియేటర్‌లో ఫ్యాన్స్ మధ్యలో సినిమా చూడటం తనకు ఆనందం కలిగించిందని చెప్పారు. తొలి ప్రేమ తర్వాత పవన్ చూసింది రంగ స్థలమేనని రామ్ చరణ్ గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ తన సభలో కూర్చుని ఉండగా తాను ఏమీ మాట్లాడలేనని రామ్ చరణ్ చెప్పారు. సినిమా చూశాక అమ్మ, నాన్న, కళ్యాణ్ బాబాయి ఇచ్చిన రియాక్షన్ తాను మర్చిపోలేనన్నారు. రామ్ చరణ్ ధన్యవాదాలు చెబుతూ ఎన్టీవీ చౌదరికి ధన్యవాదాలనబోయి టీవీ9 చౌదరికి ధన్యవాదాలని చెప్పారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని రేపంతా టీవీలో ఇదే చూపించరుకదా అంటూ ఎన్టీవీ చౌదరికి ధన్యవాదాలని చెప్పారు. పవన్ మాట్లాడినప్పుడు కూడా సరదాగా టీవీ9 చౌదరి అంటూ ఎన్టీవీ చౌదరిని సంభోదించారు. చరణ్ చెప్పినట్లు టీవీ9 చౌదరి కాదని ఎన్టీవీ చౌదరి అని చెప్పారు. ఎన్టీవీ చైర్మెన్ నరేంద్ర చౌదరి కూడా రెండు సందర్భాల్లోనూ సరదాగా నవ్వేశారు.