ఉగ్రం మోషన్ పోస్టర్ విడుదల
Updated:
20-03-2018 08:07:44
ఉగ్రం మోషన్ పోస్టర్ విడుదలైంది. నక్షత్ర మీడియా పతాకంపై ఖాసిం సమర్పణలో జె.డి. చక్రవర్తి హీరోగా, అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో ‘నక్షత్ర’ రాజశేఖర్ నిర్మించిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ‘ఉగ్రం’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, షూటింగ్ అనంతర కార్యక్రమాలకు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నక్షత్ర రాజశేఖర్ మాట్లాడుతూ..‘‘గులాబి, సత్య వంటి హిట్ చిత్రాల తర్వాత జె.డి. చక్రవర్తిగారు అమ్మ రాజశేఖర్ చెప్పిన కథకు ఎంతో ఇన్‌స్పైర్ అయ్యి నటించిన చిత్రమిది. యాక్షన్‌కి, నేపథ్య సంగీతానికి మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. ఉగాదికి ‘ఉగ్రం’ ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నాం..’’ అని అన్నారు.
జె.డి. చక్రవర్తి, అక్షత, మనోజ్ నందన్, బెనర్జీ, శ్రీరామ్ చంద్ర, సంపూర్ణేష్ బాబు, చమ్మక్ చంద్ర, ఆర్పీ, గౌతంరాజు, షాని, రాజుభాయ్, టార్జాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జాన్ పోట్ల, కెమెరా: అంజి, ఎడిటర్: ఎస్. ఎస్., ఫైట్స్: అవినాష్, మాటలు: రాఘవ. టి, ఆర్ట్: వెంకటేష్, డ్యాన్స్: అమ్మ రాజశేఖర్, జోజో, లిరిక్స్: భాషాశ్రీ, నిర్మాత: నక్షత్ర రాజశేఖర్, సహనిర్మాత: బండిశివ, కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: అమ్మరాజశేఖర్.