మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

ది సాంగ్ ఆఫ్ భరత్‌‌కు మిలియన్ వ్యూస్

Updated: 25-03-2018 01:46:41

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన భరత్ అను నేను సినిమాలోని ది సాంగ్ ఆఫ్ భరత్‌ను ఇప్పటివరకూ పది లక్షల మందికి పైగా చూశారు. కొరటాల శివ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. చిత్రానికి సంబంధించిన షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దీనికి కంటిన్యుయేషన్‌గా పూణేలో షెడ్యూల్ ఉంటుంది. మార్చి 27 వరకూ టోటల్‌గా సినిమాకి సంబంధించిన వర్క్ అంతా పూర్తవుతుందని నిర్మాత దానయ్య తెలిపారు. మహేశ్ బాబు సరసన కైరా అద్వానీ నటించారు. ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్‌ ప్రధాన తారాగణం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. పాటలు రామజోగయ్య శాస్త్రి. 

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.