మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

టెల్ మీ బాస్ పిక్చర్స్ కుమార్ రాజా కొత్త చిత్రం ప్రారంభం

Updated: 22-04-2018 03:22:29

టెల్ మీ బాస్ పిక్చర్స్  పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్రం ప్రారంభోత్సవానికి అన్నపూర్ణ స్టూడియో వేదికగా మారింది. ఈనెల 21వ తేదీన ఉదయం 10.35 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగింది. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్, ‘పెళ్లిచూపులు’ ఫేమ్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి, హీరో శ్రీకాంత్ గారు, ఇంకా మరెందరో ప్రముఖులు  విచ్చేశారు. 
 
యాక్షన్, లవ్, కామెడీ, సెంటిమెంట్‌లతో తెరకెక్కనున్న ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరిస్తుందని శ్రీచక్ర నమ్మకంగా వెల్లడించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మొత్తం షూటింగ్ జరూపుకుని వచ్చే దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము అన్నారు.
 
ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు లీడ్ రోల్స్‌లో కుమార్ రాజా, ప్రియా చౌదరి, ప్రియాంక శర్మ, D10 ఫేమ్ ఆక్సాఖాన్ నటిస్తున్నారు. ప్రతినాయకుడిగా నటశిఖరం సాయికుమార్, తొలిపరిచయంగా జీత్ సింగ్ నటిస్తున్నారు. సపోర్టింగ్ ఆర్టిస్టులుగా సత్యప్రకాష్, హేమా, హిమజ, రాజీవ్ కనకాల, రఘుబాబు, ఫన్ బకెట్ ఫేమ్ మహేష్ విట్ట, భరత్, జబర్దస్త్ ఫేమ్ రైజింగ్ రాజు తదితరులు నటిస్తున్నారు.

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.