ఇంతలో ఎన్నెన్ని వింతలో సినిమాకు ప్రేక్షకాదారణ
Updated:
13-04-2018 02:10:16
హరి హర చలన చిత్ర పతాకం పై ఈ నెల 6న విడుదలైన చిత్రం " ఇంతలో ఎన్నెన్ని వింతలో" ఈ చిత్రం విడుదలై 2వ వారం లోకి అడుగుపెటింది. ఇప్పటికి అన్ని చోట్లా ప్రేక్షకాదారణ పొందుతుంది. ఈ సందర్బంగా ప్రొడ్యూసర్ రామ్మోహన్ రావు ఇప్పిలి ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా నిర్మాత రామ్మోహన్ రావు ఇప్పిలి మాట్లాడుతూ... ముందుగా మా హరి హర చలనచిత్ర బ్యానర్ లో మొదటి చిత్రం "ఇంతలో ఎన్నెన్ని వింతలో" హిట్ ని మేము ఇంతగా ఎంజాయ్ చేస్తున్నాము, అంటే దానికి ముఖ్య కారణం మా మీడియా మిత్రులే అని నిస్సందేహం గా చెప్పుకొంటాము. మీరు అందరూ మీడియా ప్రీమియర్ షో కి వచ్చి మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్సు ఇవ్వడం, సినీయర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారు మా సినిమా పూర్తిగా చూసి మా యూనిట్ ని ఆశీర్వదించడం మాకు అతి పెద్ద కాంప్లిమెంట్ గా భావించాము. పసుపులేటి రామారావు గారిలాంటి పెద్దల ఆశీర్వాదాలు మా యూనిట్ కి ఎప్పుడూ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాము.
సినిమాలు అంటే ప్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించాము,మాకు ఈ చిత్ర విజయం తో మాకు సినిమా పట్ల ఉన్న ఇష్టం మరింత పెరిగింది. మంచి సినిమాను తీస్తే మీడియా సపోర్ట్, అలానే ప్రేక్షకుల నుండి ఫ్రెండ్స్ నుండి ఇంత రెస్పాన్స్ వస్తున్నందుకు మాకు చాలా సంతషం గా ఉంది.ఈ ఆనందం నేను మాటల్లో చెప్పలేను.మా చిత్రం ఇప్పటికీ థియేటర్స్ సంఖ్య పెరుగుతున్నాయి.ఈ ఆనందాన్ని మీడియాతో పంచుకోడం కోసం మా పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేసాము త్వరలోనే "ఇంతలో ఎన్నెని వింతలో" మూవీ గ్రాండ్ సక్సెస్ మీట్ పెడుతున్నాము. అని తెలియ చేస్తూ మా హరిహర చలనచిత్ర బ్యానర్ లో 2వ ప్రాజెక్ట్ ని కుడా త్వరలో అనౌన్స్ చేస్తాము ఇప్పుడు "ఇంతలో ఎన్నెని వింతలో" సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాము అని చెబుతూ ఒక మీడియా మిత్రుడు మీ బ్యానర్ లో ఎ హీరోలతో సినిమాలు తియ్యాలి అనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు నవ్వుతూ ఆశ అనుకుంటే శ్రీ విష్ణు అత్యాశ అనుకుంటే బాలయ్య బాబు గారితో అని యువ నిర్మాత రామ్మోహనరావు ఇప్పిలి తెలిపారు.