వి.వి.వినాయక్ చేతుల మీదుగా శంభో శంకర తొలి లిరికల్ సాంగ్ ఆవిష్కరణ
Updated:
02-05-2018 02:24:01
శంకర్ హీరోగా శ్రీధర్ ఎన్. దర్శకత్వంలో ఎస్. కె. పిక్చర్స్ సమర్పణలో ఆర్.ఆర్ . పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రం `శంభో శంకర`. ఈ సినిమాలో తొలి లిరికల్ సాంగ్ ను మే డే సందర్భంగా సెన్షేషనల్ డైరెక్టర్ వి. వి.వినాయక్ మంగళవారం ఉదయం హైదరాబాద్ లో విడుదల చేసారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ` సినిమాల్లో అవకాశాలు రాలేదని బాధపడుతోన్న వారందరికీ శంకర్ ఓ స్ఫూర్తి. రెండు సంవత్సరాలు నాతో ట్రావెల్ అయ్యాడు. ఎక్కడో శ్రీకాకుళం జిల్లా మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఈరోజు హీరోగా ఎదగడం చాలా ఆశ్చర్యంగాను సంతోషంగాను ఉంది. శంకర్ ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలి. మొదటి పాట బాగుంది. శంకర్ మాస్ లుక్ లో బాగున్నాడు. సినిమా కు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందిరికీ సినిమా విజయం సాధించి మంచి పేరు తీసుకురావాలి` అని అన్నారు.
హీరో శంకర్ మాట్లాడుతూ, ` వినాయక్ గారు నాకు ఇండస్ర్టీలో గాడ్ ఫాదర్. ఆయన నాకు స్ఫూర్తి దాయకులు. వినాయక్ గారి దగ్గర చాలా కాలం పనిచేసా. చాలా విషయాలు తెలుసుకున్నా. ఇప్పుడు నా స్నేహితుడు శ్రీధర్ తో కలిసి సినిమా చేస్తున్నా. మంచి కథ. సినిమా బాగా వచ్చింది. దీనంటికీ కారణం మా నిర్మాతలు. వాళ్లు లేకపోతే సినిమా లేదు. సాయి కార్తీక్ గారు చాలా మంచి మ్యూజిక్ అందించారు. పాటలు, సినిమా పెద్ద విజయం సాధిస్తాయన్న నమ్మకం ఉంది` అన్నారు.
చిత్ర దర్శకుడు ఎన్. శ్రీధర్ మాట్లాడుతూ, ` శంకర్ నా స్నేహితుడు. ఇద్దరం చాలా కష్టపడి వచ్చాం. ఈ సినిమాతో నేను దర్శకుడిగా, శంకర్ హీరోగా పరిచయం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం నిర్మాతలు రమణా రెడ్డిగారు, సురేష్ కొండేటి గారు ఎక్కడా రాజీ పడలేదు. నేను అడిగిందల్లా క్షణాల్లో ఏర్పాటు చేసేవారు. అందుకే సినిమా ఇంత గొప్పగా వచ్చింది. శంకర్ మాస్ హీరో కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. మా సినిమా కోసం సాయి కార్తీక్ పెద్ద సినిమాలున్నా రేయింబవళ్లు మా కోసం పనిచేసారు. అందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు` అని అన్నారు.
సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ, ` ఈరోజు `శంభోశంకర` తొలిసాంగ్ వినాయక్ గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం ఆనందంగా ఉంది. శంకర్ పెద్ద హిట్ కొట్టాలి. శ్రీధర్ సినిమా బాగా తెరెక్కించారు. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలి` అని అన్నారు.
చిత్ర నిర్మాతలలో ఒకరైన సురేష్ కొండేటి మాట్లాడుతూ, ` మేడే సందర్భంగా సినిమాలో మొదటి పాటను రిలీజ్ చేసాం. దర్శక రత్న దాసరి గారు కార్మిక నాయుడు. ఆ తర్వాత దర్శకుల్లో ఆ తరహలో ఉండే వ్యక్తి వినాయక్ గారు. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయన లేని లోటు వినాయక్ గారు తీరుస్తారనిపిస్తుంది. చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా వినాయక్ గారు ఎవరికైనా సహకరిస్తారు. అందరితో కలిసి మెలిసి ఉంటారు. కొత్త వారు వీళ్ల పాటను నేను రిలీజ్ చేయడం ఏంటి? అనుకునే వ్యక్తి కాదు. ముందుగా వినాయకుడి పూజ చేస్తాం. అలాగే మా సినిమా తొలి సాంగ్ ను వినాయక్ గారి చేతులు మీదుగా లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. హీరో శంకర్, దర్శకుడు శ్రీధర్ ఐదు నెలలు అహర్నిశలు శ్రమించారు. వాళ్ల కష్టం వృద్ధా కాదు. స్టార్ హీరోలకు సమానంగా శంకర్ కష్టపడ్డాడు. సాంగ్స్ , ఫైట్స్ ఇరగదీసాడు. ఈ సినిమాతో హిట్ తో శంకర్ ను అంతా శంభో శంకర్ అంటారు. శ్రీధర్ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతీ సన్నివేశం హైలైట్ గా ఉంటుంది. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతం అదించారు. మాస్ లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. చక్రి తర్వాత మాస్ లో అంత ఫాలోయింగ్ సంపాదించుకుంది ఆయనే. ఆర్. ఆర్ అయితే అదరగొట్టేసారు. ఫోటోగ్రఫీ బాగా వచ్చింది. భవానీ ప్రసాద్ డైలాగులు అద్భుతంగా రాసారు. చాలా అనుభవం గల రైటర్ ఆయన. పెద్ద రచయితలతో పాటలు రాయించాం. `రంగస్థలం` టాప్ సింగర్స్ తో పాటలు పాడించాం. అన్నీ చక్కగా కుదిరాయి. ఇక నిర్మాత రమణా రెడ్డి గారు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సినిమా కోసం ఒక రూపాయి ఎక్కువే ఖర్చు చేసాం. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు` అని అన్నారు.
రచయిత భవానీ ప్రసాద్ మాట్లాడుతూ, ` సినిమాలో శంకర్ ను చూస్తే ఆడియన్స్ షాక్ అవుతారు. శకలక శంకర్ కు బధులుగా శంభో శంకర గా పిలుస్తారు. డ్యాన్సులు, ఫైట్లు అన్నింటిని చక్కగా చేసారు. దర్శకులు శ్రీధర్ కొత్తవారైనా చాలా చక్కగా తెరకెక్కించారు. నేను అనుకున్న దానికన్నా బాగా చేసారు. సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. సాయి కార్తీక్ గారు సంగీతం సినిమాకు పెద్ద అస్సెట్. మా సినిమా కోసం మనసు పెట్టి పనిచేసారు. ఇప్పటివరకూ ఆయన చాలా సినిమాలకు సంగీతం అందించారు. కానీ ఈ సినిమా ఆయనకు స్పెషల్ గా ఉంటుంది` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత రమణారెడ్డి, సంతోష్ సాకె, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.