చివరి షెడ్యూల్‌లో ఇది కల కాదు
Updated:
02-05-2018 01:17:43
శ్రీజ, మాధురి దీక్షిత్, షఫీ, బిందు, గౌతమి తదితరులు ముఖ్య తారాగణంగా పరింద ఆర్ట్స్ పతాకం పై విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం 'ఇది కల కాదు'. వాస్తవ సంఘటనలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి దర్శకుడు అదీబ్ నజీర్. ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుని చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సందర్భంగా దర్శకుడు అదీబ్ నజీర్ మాట్లాడుతూ.. ''పది మంది హీరోయిన్లతో పరింద ఆర్ట్స్ పై విభిన్న కథాంశంతో 'ఇది కల కాదు' చిత్రంని తెరకెక్కిస్తున్నాము. ఇటీవల జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలకు దగ్గరగా వుంటుందీ చిత్రం. మంచి కథ కుదిరింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మరియు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో రెండో షెడ్యూల్స్ తో పాటు మూడు పాటల చిత్రీకరణ పూర్తి చేశాము. మే నెల రెండో వారంతో చిత్రం చివరి షెడ్యూల్ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము..'' అని అన్నారు.
శ్రీజ, మాధురి దీక్షిత్, షఫీ, బిందు, గౌతమి, మాధవి, బెనర్జీ, సమీర్, మనీషా, అనూష, హారిక, కవిత, రీతు, గుల్జార్, బాష, భాస్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ దర్శకత్వం: అదీబ్ నజీర్, కెమెరా: సత్యానంద్, డాన్స్ డైరెక్టర్: రామారావు.