ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభం సందర్భంగా వెంకయ్య ఏమన్నారంటే?
Updated:
29-03-2018 11:22:44
ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రారంభం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు. "తండ్రి జీవన పాత్రను సజీవంగా మళ్ళీ చూపించే ప్రయత్నం కుమారుడు చేయడం దేశ చరిత్ర లోనే ప్రథమం" అని వెంకయ్య చెప్పారు. తండ్రికి తగ్గ తనయుడు బాలయ్య అన్నారు. సినిమా విజయవంతం కావాలని, అందరి మనసులు చూరగొనాలని వెంకయ్య ఆకాంక్షించారు. సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ అభిమానులేనని వెంకయ్య చెప్పారు. కృష్ణుడు, రాముడు ఎలా ఉంటారంటే అందరికీ ఎన్టీఆర్ గుర్తుకొస్తారని వెంకయ్య చెప్పారు. తనకు రామారావు అంటే ఎంతో అభిమానమని చెప్పారు. కార్యక్రమంలో దర్శకుడు రాఘవేంద్రరావు, నటి జమున, సినీ నటుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం కీరవాణి అందిస్తున్నారు.