మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

ప‌రుగుల వ‌ర‌ద‌.. చిన్నారుల స‌రదా..

Updated: 10-02-2017 08:23:25

హైదరాబాద్: ఉప్ప‌ల్ స్టేడియంలో టీం ఇండియా ఆట‌గాళ్లు ఓ ప‌క్క ప‌రుగుల వ‌ర‌ద పారిస్తుంటే మ్యాచ్ చూసేందుకు వ‌చ్చిన ఫ్యాన్స్ చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. కెప్టెన్‌ కోహ్లీ డ‌బుల్ సెంచ‌రీతో ఇర‌గ‌దీస్తే ముర‌ళీ విజ‌య్‌, వృద్ధిమాన్ సాహ సెంచ‌రీల‌తో చెల‌రేగిపోయారు. త‌మ అభిమాన ఆట‌గాళ్ల ఆట‌ను క‌ళ్లారా చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన ఫ్యాన్స్‌కు భార‌త ఆట‌గాళ్లు పండ‌గ చేసుకునేలా చేశారు. కోహ్లీ, విజ‌య్‌, సాహా ఫోర్లు, సిక్స‌ర్ల‌తో క‌దం తొక్కుతుంటే ఫ్యాన్స్ ఈల‌లు, అరుపుల‌తో స్టేడియంను హోరెత్తించారు. మ్యాచ్ చూసేందుకు వ‌చ్చిన ఎస్ ఆర్ నాయ‌క్ న‌గ‌ర్ లోని టివిఆర్ స్మార్ట్ ప్యూచ‌ర్ కిడ్స్ విద్యార్దులు.. టీం ఇండియా ఆట‌గాళ్ల‌ను చ‌ప్ప‌ట్లు కొడుతూ ఉత్సాహ‌ప‌రిచారు. జాతీయ జెండా చేబూని భార‌త్ మాతాకీ .జై అంటూ నినాదాలు చేశారు.  

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.