మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆరోగ్యం న్యూస్

బీరులో విట‌మిన్‌.. క్యాన్స‌ర్ రోగుల నొప్పిని త‌గ్గిస్తుందట‌!

Updated: 28-02-2017 07:33:21

వాషింగ్ట‌న్‌: బీరు, పాల‌లో గుర్తించిన ఒక విట‌మిన్ క్యాన్స‌ర్ రోగుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంద‌ట‌. క్యాన్స‌ర్ బాధితుల‌కు కీమో థెర‌పీతో క‌లిగే విప‌రీత‌మైన నొప్పిని త‌గ్గించే చికిత్స‌లో ఈ విట‌మిన్‌ను ఉప‌యోగించవ‌చ్చంటున్నారు ప‌రిశోధ‌కులు. ఈ విష‌యం తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. కీమో థెర‌పీ చేయ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ రోగుల జీవిత‌కాలం పెర‌గ‌డం మాట అటుంచితే ఈ చికిత్స విధానం వారి ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్ర‌భావాల‌ను చూపుతోంది. ప్ర‌త్యేకించి చాలా మందులు న‌రాల వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీస్తుండ‌డంతో క్యాన్స‌ర్ బాధితుల శ‌రీరం క్ర‌మంగా మ‌రింత సున్నితంగా మారుతోంది. ఈ నేప‌థ్యంలో చికిత్స‌లో భాగంగా బీరు, పాల‌ల్లో ల‌భించే నికోటిన‌మైడ్ రైబోసైడ్‌(ఎన్ ఆర్‌) అనే విట‌మిన్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కీమో నొప్పిని త‌గ్గించ‌వ‌చ్చ‌ని శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు. అయోవా వ‌ర్సిటీకి చెందిన ప‌రిశోధ‌నా బృందం ఎన్ఆర్‌ను విట‌మిన్ బీ3 రూపంలో ఎలుక‌ల‌పై ప్ర‌యోగించి చూడ‌గా స‌త్ఫ‌లితాలు వ‌చ్చాయి. ఈ ఎలుక‌ల‌కు క్యాన్స‌ర్ చికిత్స‌కు వాడే పాక్లిటాక్సెల్ మందును కూడా ఇచ్చారు. ఇది తీవ్ర‌మైన నొప్పిని క‌ల‌గ‌జేస్తుంది. అనంత‌రం ఎన్ఆర్‌ను ఇవ్వ‌గా నొప్పి త‌గ్గ‌డంతో పాటు శ‌రీరం సున్నితంగా మార‌డం కూడా త‌గ్గిన‌ట్లు గుర్తించామ‌ని అధ్య‌య‌న‌క‌ర్త మార్తా హామిటీ తెలిపారు. ఈ అధ్య‌య‌నం పెయిన్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైంది. 

షేర్ :

మరిన్ని ఆరోగ్యం న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.