మీ చిన్నారులకు స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా?
Updated:
15-03-2017 11:19:03
లండన్: మీ చిన్నారులు ఆడుకునేందుకు స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ వార్త చదివాక ఇవ్వాలో వద్దో నిర్ణయించుకోండి. స్మార్ట్‌ఫోన్ వాడకంతో చిన్నారుల కళ్లు పొడిబారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ అదే పనిగా చూస్తూ డ్రై ఐ డిసీజ్ ఖాయమని నిపుణులు చెబుతున్నారు. అనేక దేశాల్లో దీనిపై పరిశోధనలు సాగుతున్నాయి. దక్షిణ కొరియాలోని ఛుంగ్ యాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో ఆందోళన కలిగించే విషయాలు బయటపడ్డాయి. స్మార్ట్‌ఫోన్ ఎక్కువ సేపు చూడటం వల్ల కేవలం కళ్లు పొడిబారటమే కాకుండా కంటికి సంబంధించి ఇతర సమస్యలు కూడా తలెత్తుతున్నాయని వారి పరిశోధనల్లో తేలింది. ఆడుకునేందుకు స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లు కాకుండా మరేదైనా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.