నాగార్జున సూపర్ మాస్ సాంగ్ ను రీమిక్స్ చేస్తున్న నాగచైతన్య
Updated:
13-04-2018 03:14:33
నాగార్జున కెరీర్ లో ఒన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన "అల్లరి అల్లుడు" చిత్రంలోని "నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గాయిత్తు" అనే సాంగ్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాస్ సాంగ్ ను యువసామ్రాట్ నాగచైతన్య తన తాజా చిత్రం "సవ్యసాచి"లో రీమిక్స్ చేస్తున్నాడు. "శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం" చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొన్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. "నిన్ని రోడ్డు మీద చూసినాది లగ్గాయిత్తు" రీమిక్స్ లో చైతూతో ఓ అగ్ర కథానాయకి ఈ పాటలో చిందేయనుంది. ఆమె ఎవరన్నది త్వరలోనే వెల్లడించనున్నారు దర్శకనిర్మాతలు. ఒరిజినల్ వెర్షన్ ను కంపోజ్ చేసిన కీరవారి ఈ రీమిక్స్ వెర్షన్ కి కూడా సంగీత దర్శకులు అవ్వడం విశేషం. మాధవన్, భూమికలు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో చైతూ సరసన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతోంది.
నాగచైతన్య అక్కినేని, నిధి అగర్వాల్, మాధవన్, రావురమేష్, వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, సినిమాటోగ్రఫీ: యువరాజ్, కళ: రామకృష్ణ, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, కో-డైరెక్టర్: చలసాని రామారావు, సి.ఈ.ఓ: చిరంజీవి (చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పిటి.గిరిధర్, నిర్మాతలు: వై.నవీన్-వై.రవిశంకర్-మోహన్ (CVM), కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: చందూ మొండేటి.