మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

నమ్మితే మహేశ్‌ హార్ట్‌ అండ్‌ సోల్‌ పెట్టేస్తారు-కొరటాల శివ

Updated: 08-04-2018 03:01:13

సూపర్‌స్టార్‌ మహేశ్‌, డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంప దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమా బ‌హిరంగ స‌భ హైదరాబాద్‌ ఎల్‌.బి.స్టేడియలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్‌కి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులతో ఎల్‌.బి.స్టేడియం కిక్కిరిసిపోయింది. భారీ అభిమాన సందోహం మధ్య జరిగిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ కార్యక్రమానికి విచ్చేసిన సూపర్‌స్టార్‌ కృష్ణ మేకింగ్‌ ఏవీని విడుదల చేశారు. థియేట్రికల్‌ ట్రైలర్‌ను యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ విడుదల చేశారు. 
 
 
మ‌హేశ్‌ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తోనే ఇంత పెద్ద సినిమా చేయ‌గ‌లిగా-కొరటాల శివ 
 
 
కొరటాల శివ మాట్లాడుతూ - ''కొరటాల శివ అనే నేను భయం, భక్తులతో తీశానని హామీ ఇస్తున్నాను. కథ చెప్పినప్పుడు మహేశ్‌గారికి ఎలా చెప్పాలో తెలియక ఇది పెద్ద కథ సార్‌ అని చెప్పాను. ఫస్టాఫ్‌ రెండున్నర గంటలు.. సెకండాఫ్‌ రెండున్నర గంటలు చెప్పాను. మొత్తం విన్న ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్‌ మరచిపోలేను. కథను కానీ, టెక్నీషియన్‌ను కానీ నమ్మితే హార్ట్‌ అండ్‌ సోల్‌ పెట్టేస్తారాయన. ఇందులో మహేశ్‌గారు ముఖ్యమంత్రి పాత్రలో కనపడతారు. హ్యాండ్‌ సమ్‌ సీఎంలాగానే కాదు.. డైనమిక్‌ సీఎంలా కనపడతారు. ఆయన సపోర్ట్‌ లేకపోతే ఇంత పెద్ద సినిమాను చేయలేకపోయేవాణ్ణి. దానయ్యగారు నన్ను కలిసిన తొలిరోజే రిచ్‌ సినిమా ఇవ్వండి సార్‌! అన్నారు. సినిమాకు బాగానే ఖర్చయిన ఎక్కడా తగ్గకుండా నిర్మించారు. దేవిశ్రీ నాతో మిర్చి సినిమా నుండి ట్రావెల్‌ అవుతున్నాడు. తను కథను ఫీలై సంగీతం అందిస్తాడు. ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. రామజోగయ్యగారు ప్రాణం పెట్టి సాహిత్యం ఇచ్చారు. ఈ సినిమా రియల్‌ పొలిటికల్‌ ఎట్మాస్పియర్‌లో రావాలనుకున్నప్పుడు మా సినిమాటోగ్రాఫర్స్‌ రవికె.చంద్రన్‌, తిరునావుక్కరసు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ సురేశ్‌గారు ఏడాదిన్నర మరో సినిమా చేయకుండా ఎంతో కష్టపడ్డారు. సినిమా ఇంత అద్భుతంగా వచ్చిదంటే ఆయనే కారణం. రామ్‌లక్ష్మణ్‌గారు మంచి యాక్షన్‌ సీన్స్‌ను కంపోజ్‌ చేశారు. ధోని సినిమా చూసి కియరా అద్వాని అయితే ఈ సినిమాకు సెట్‌ అవుతుందనిపించి.. తను అప్రోచ్‌ కాగానే ఎగ్జయిట్‌మెంట్‌తో సినిమాలో నటించింది. శ్రీకర్‌గారు ఫైనల్‌గా అద్భుతంగా కట్‌ చేశారు. ఈ వేడుకకి చీఫ్‌గెస్ట్‌గా విచ్చేసిన ఎన్టీఆర్‌గారికి స్పెషల్‌ థాంక్స్‌. మహేశ్‌గారితో, ఎన్టీఆర్‌గారితో, చరణ్‌గారితో స్పెషల్‌ బాండింగ్‌ ఉంది. అందరూ అభిమానులు కలిసి కూర్చుని ఉంటే చూడటానికి చాలా అందంగా ఉంది. నేను పనిచేసే హీరోలందరితో ప్రాణం పెట్టే పనిచేస్తాను. ప్రతి సినిమాకు పూర్తి ఎఫర్ట్‌ పెట్టి బ్లాక్‌బస్టర్‌ కావాలంటే ఫ్యాన్స్‌ అందరూ ఏకం కావాలి. ఎందుకంటే తెలుగు సినిమా నెక్స్‌ట్‌ లెవల్‌కు వెళుతుంది. ఇలాంటి సమయంలో ఫ్యాన్స్‌ ఏకమైతే వచ్చే సౌండ్‌ వేరేలా ఉంటుంది. ఇలాంటి ఫంక్షన్స్‌ను మరెన్నో జరుపుకుంటాం. అభిమానుల సపోర్ట్‌ ఇలాగే ఉండాలి'' అన్నారు.
 
 
 
శ్రీమంతుడు చిత్రాన్ని క్రాస్ చేస్తుంది- సూపర్‌స్టార్‌ కృష్ణ
 
 
ఈ సందర్భంగా... సూపర్‌స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ - ''మహేశ్‌, కొరటాల‌ కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో మనకు తెలిసిందే. అన్ని రికార్డులను తిరగరాసింది. ఇక 'భరత్‌ అనే నేను' సినిమా విషయానికి వస్తే.. సాంగ్స్‌, ట్రైలర్‌ సహా కొన్ని డైలాగ్స్‌ అన్నీ చూశాను. చూస్తుంటే ఈ సినిమా శ్రీమంతుడుని క్రాస్‌ చేసి పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నాను. మహేశ్‌ లైఫ్‌లోనే ఈ సినిమా నెంబర్‌ వన్‌ మూవీ అవుతుందనే నా నమ్మకాన్ని అభిమానులు నిజం చేస్తారని నమ్ముతున్నాను'' అన్నారు. 
 
 
 
 
మ‌హేశ్‌గారితో ఓ పెద్ద సినిమా చేయాల‌నే కోరిక తీరింది
-దానయ్య డివివి
 
దానయ్య డివివి మాట్లాడుతూ - ''యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. డైరెక్టర్‌ కొరటాల శివగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత గొప్ప ... పెద్ద సినిమా చేసినందుకు ఆయనకు థాంక్స్‌. మహేశ్‌బాబుతో సినిమా చేయాలనుకునే కోరిక ఈ సినిమాతో తీరింది. ఆడియో ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో మనకు తెలిసిందే. దేవిశ్రీ, రామజోగయ్యశాస్త్రిగారికి థాంక్స్‌. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. అభిమానులు సినిమా గురించి ఎంత గొప్పగా ఊహిస్తున్నారో. అంతకన్నా గొప్పగా ఉంటుందని హామీ ఇస్తున్నాను'' అన్నారు. 
 
 
23 ఏళ్ల‌లో ఇంత పెద్ద ఫంక్ష‌న్‌ని చూడ‌లేదు-దిల్‌రాజు
 
 
హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ''నేను ఇండస్ట్రీకి వచ్చి 23 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి భారీ ఈవెంట్‌ను ఇప్పటి వరకు చూడలేదు. మహేశ్‌, ఎన్టీఆర్‌ అభిమానులకు థాంక్స్‌. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదొక కొత్త ఒరవడి. ఓ స్టార్‌ హీరో సినిమాకు మరో స్టార్‌ హీరో ముఖ్య అతిథిగా హాజరు కావడం అనేది గొప్ప విషయం. ఇలాంటి ఈవెంట్‌ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ ఇండియన్‌ సినిమాకు ఆదర్శం కావాలి. మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్‌ చిత్రాలతో మెసేజ్‌ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ 'భరత్‌ అనే నేను' సినిమా ద్వారా పొలిటికల్‌ సెటైర్‌ మెసేజ్‌ ఇస్తున్నాడు. ఆల్‌రెడీ ట్రైలర్‌లో చూపించారు. శివ అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా మహేశ్‌బాబుగారు కొత్తగా చేసే ఉంటారు. ఈ సమ్మర్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యి తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్‌ 5 సినిమాల్లో ఒకటిగా నిలవాలని కోరుకుంటున్నాను'' అన్నారు. 
 
 
మ‌హేశ్‌!.. రియ‌ల్ సూప‌ర్‌స్టార్‌
- వంశీ పైడిపల్లి 
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ''శివ డైరెక్టర్‌గా తనకంటూ ఓ సెపరేట్‌ దారిని క్రియేట్‌ చేసుకున్నాడు. తను తీసిన  మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్‌ సినిమాలతో మంచి మెసేజ్ ఇచ్చాడు. ఇప్పుడు తన హీరో సీఎం అయితే ఏం చేయగలడో ఈ సినిమా ద్వారా శివ చెప్పబోతున్నాడు. దేవిశ్రీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. మంచి మ్యూజిక్‌తో తనెంటో ప్రూవ్‌ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. మహేశ్‌గారితో ఏడాదిన్నరగా ట్రావెల్‌ చేస్తున్నాను. ఆయన్ను చాలా దగ్గర నుండి చూశాను. ఆయనకు సినిమా అంటే.. అభిమానులంటే ఎంతిష్టమో చూశాను. 'భరత్‌ అనే నేను' ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్స్‌లో ఒకటిగా నిలుస్తుంది. ఆయనతో పనిచేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎన్టీఆర్‌గారు.. ఈ వేడుకకి వస్తున్నందకు ఆయనకి థాంక్స్‌. వాళ్ళిద్దరూ ఓ ఫంక్షన్‌కి వస్తే ఇలాంటి రెస్పాన్స్‌ వస్తుందంటే.. ఇద్దరూ కలిసి యాక్ట్‌ చేస్తే ఎలా ఉంటుందో కదా! భవిష్యత్‌లో మా కోరిక తీరాలని.. తీరుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు. 
 
 
ఓ పండుగలా ఉంది- దేవిశ్రీ ప్రసాద్‌ 
 
రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ - ''కొరటాల శివగారు సినిమాల్లోనే కాదు.. బయటకూడా మంచి మెసేజ్‌లు నేర్పుతున్నారు. ఆయనతో నాలుగు సినిమాలు చేశాను. ఆయన ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌తోనే మంచి మ్యూజిక్‌ ఇవ్వగలిగాను. మహేశ్‌, ఎన్టీఆర్‌ కలయికలో జరుగుతున్న ఈ ఫంక్షన్‌ను చూస్తుంటే ఓ పండుగను చూస్తున్నట్లుంది. రామజోగయ్యశాస్త్రిగారు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. నాతో పాటు వర్క్‌ చేసిన టెక్నీకల్‌ టీంకు థాంక్స్‌'' అన్నారు. 
బాక్సాఫీస్ కుర్చీ ఎక్కాలి
 సుధీర్‌ బాబు మాట్లాడుతూ - ''మనం క్లాప్‌ కొట్టేటప్పుడు వచ్చే సౌండ్‌ మహేశ్‌బాబుగారు అయితే, క్లాప్స్‌ కొట్టే రెండు చేతులు కొరటాల శివగారు.. దేవిశ్రీ ప్రసాద్‌గారు..టీజర్‌ చూసినప్పుడు మహేశ్‌లో కమిట్‌మెంట్‌, ఇన్‌టెన్సిటీ కనపడుతుంది. నాకు గూజ్‌బామ్స్‌ వచ్చాయి. ఆల్‌రెడీ భరత్‌ సీఎం కుర్చీ ఎక్కేశాడు. ఏప్రిల్‌ 20న బాక్సాఫీస్‌ కుర్చీ ఎక్కాలని కోరుకుంటున్నాను'' అన్నారు. 
 
 
సీనియర్‌ నరేశ్‌ మాట్లాడుతూ - ''భరత్‌ అనే నేను.. అనే డైలాగ్‌ ఈ ఏడాది బెస్ట్‌ డైలాగ్‌గా నిలిచిపోతుంది. ఆల్‌ ఇండియా అందగాడు మహేశ్‌, స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ, స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య కాంబినేషన్‌లో 'భరత్‌ అనే నేను' సినిమా రూపొందుతోంది. ఇంతకుముందు మహేశ్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన 'శ్రీమంతుడు' అందరినీ ఎంటర్‌టైన్‌ చేయడమే కాకుండా.. లక్షలు, కోట్ల మంది యువతకు దిశ, దశ కల్పించి గ్రామాల వైపు తిప్పేలా చేసింది. అదే కాంబినేషన్‌లో మరో కోణంలో.. భారతదేశంలో రాజకీయ క్వశ్చన్‌ మార్కు పడుతున్న టైమ్‌లో.. ఒక సమాధానాన్ని ఇవ్వడానికి.. ఓ రెస్పాన్సిబుల్‌ నాయకుడు రావాలనే మంచి మెసేజ్‌తో చేస్తోన్న సూపర్‌హిట్‌ మూవీ ఇది. మొత్తం యూనిట్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను'' అన్నారు. 
 
 
ఎన్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమా మహేశ్‌బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. కొరటాల శివ సహా టీం అంతటికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు. 
 
 
అనీల్‌ సుంకర మాట్లాడుతూ - ''భరత్‌ అనే నేను.. అనే ప్రమాణ స్వీకారంతో సినిమా ప్రమోషన్స్‌ స్టార్ట్‌ అయ్యింది. ఇప్పుడు బహిరంగ సభ జరుగుతుంది. రేపు 20వ తేది తర్వాత ఊరేగింపు చేసుకుంటాం. బాలెట్‌ బాక్స్‌ రికార్డులు బద్దలైపోతాయి. ఎంటైర్‌ యూనిట్‌కి అభినందనలు'' అని తెలిపారు. 
 
 
హీరోయిన్ కియరా అద్వాని మాట్లాడుతూ - ''తెలుగు సినిమాలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నాను. సినిమాలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిన దానయ్యగారికి థాంక్స్‌. శివగారు నాపై నమ్మకంతో మంచి పాత్ర చేసే అవకాశం కల్పించారు. మహేశ్‌గారితో మరోసారి నటించాలనే ఆసక్తిగా ఉన్నాను'' అన్నారు. 
 
                      
                                                ఈ కార్యక్రమంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రాఫర్స్‌ రవి.కె.చంద్రన్‌, తిరునావ్‌కరసు, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సురేశ్‌, తదితరులు పాల్గొని యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రాఫర్స్‌ రవి.కె.చంద్రన్‌, తిరునావ్‌కరసు, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సురేశ్‌, తదితరులు పాల్గొని యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.