Updated: 20-02-2017 09:25:43
దిల్లీ: గుండె జబ్బు రోగులకు అవసరమైన స్టెంట్లను కొరత లేకుండా సరఫరా చేస్తామని ఉత్పత్తిదారులు, తయారీదారులు కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. స్టెంట్ల ధరలను దాదాపు 85 శాతం మేర తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో వీటికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎన్డీయే సర్కారు రంగంలోకి దిగింది. మార్కెట్‌లో స్టెంట్లకు ఎలాంటి కొరత రాకుండా చూస్తామని, అవసరమైనన్ని సరఫరా చేస్తామని ఉత్పత్తిదారులు, తయారీదారులు హామీ ఇచ్చారని ఫార్మా శాఖ కార్యదర్శి తెలిపారు. లోహపు స్టెంట్ల ధరను రూ.7,260కు, ఔషధ పూతతో కూడిన స్టెంట్లను రూ.29,600కు విక్రయించాలని కేంద్రం పరిమితులు విధించింది.
షేర్ :
తాజా వార్తలు