సంక్లిష్ట పరిస్థితుల్లో కాలేయ మార్పిడి విజయవంతం..!
Updated:
24-12-2017 02:16:57
మృత్యుముంగిట్లోకి వెళ్లిన ఒక రోగికి విజయవంతంగా కాలేయమార్పిడి చేసి రక్షించిన వైనం ఇది. ప్రాణా పాయం నుంచి కాపాడిన వైద్యులకు రోగి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ఎదురుగా ఉన్నసాయివాణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ( నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ) లో జరిగిన అరుదైన శస్త్రచికిత్స నేపథ్యం ఇది. కేసు వివరాల్నిహాస్పిటల్ డైరక్టర్ డాక్టర్ రాఘవేంద్రరావు, పేషంట్ కుటుంబసభ్యులతో కలిసి మీడియాకు వివరించారు.
గుంటూరు కు చెందిన 40 సంవత్సరాల వ్యక్తికి చిన్నప్పుడే కాలేయానికి సరఫరా చేసే కొన్ని రక్త నాళాల్లో బ్లాక్ లు ఏర్పడ్డాయి. వయస్సుతో పాటు అవి పెరుగుతూ వచ్చాయి. చివరకు రక్త నాళాలు పూడుకొని పోవటంతో కాలేయం పనితీరు మందగించింది. సాంకేతికంగా సిర్రోసిస్ అని దీన్ని వ్యవహరిస్తారు. ఇది ముదిరి పోవటంతో కాలేయం పాడైపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకొన్నారు. దీంతో రోగిని న్యూఢిల్లీ వెళ్లాల్సిందిగా స్థానిక వైద్యులు సూచించారు. ఈ పరిస్థితుల్లో ఈ రోగిని హైదరాబద్ లోని సాయివాణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ( నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ) కి తీసుకొని రావటం జరిగింది. డాక్టర్ రాఘవేంద్ర రావు నేతృత్వంలోని వైద్యుల బృందం క్రిటికల్ కండీషన్ లోని రోగిని అడ్మిట్ చేసుకొన్నారు. కాలేయం పూర్తి గా చెడిపో్యినందున కాలేయమార్పిడి చేయటమే పరిష్కారమని నిర్ధారించారు. జీవన దాన్ ప్రక్రియ కింద ఎమర్జెన్సీ కేసు గా రిజిస్టర్ చేయించారు.
ఙదే సమయంలో హైదారాబాద్ కు చెందిన రోడ్ ప్రమాదానికి గురి కావటం జరిగింది. బ్రెయిన్ డెడ్ అయినట్లుగా నిర్ధారించటంతో ఆయన నుంచి కాలేయాన్ని సేకరించాలని నిర్ణయించారు. దీంతో డాక్టర్ రాఘవేంద్ర రావు బృందం అక్కడకు చేరుకొని వెంటనే అవయవాల్ని సేకరించారు. ఇక్కడ అత్యవసరంగా లివర్ ను సేకరించటం అన్నది సంక్లిష్ట ప్రక్రియ గా చెప్పుకోవాల్సి ఉంటుంది. రక్త నాళాలతో సహా లివర్ ట్రాన్సు ప్లాంటేషన్ ను అప్పటికప్పుడు చేయటం జరిగింది. అరుదైన సంక్లిష్టమైన ఈ ఆపరేషన్ కు దాదాపు 12 గంటలకు పైగా సమయం పట్టింది. అయినప్పటికీ డాక్టర్ రాఘవేంద్ర రావు బృందం ఈ ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా చేయగలిగారు. రెండు రోజుల పాటు ఐ సీ యూ లో ఉంచి తర్వాత సాధారణ వార్డుకి మార్చటం జరిగింది.
ఈ సందర్బంగా డాక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ... ఒకప్పుడు లివర్ ట్రాన్సు ప్లాంటేషన్ అన్నది చాలా ఖరీదైన ప్రక్రియ గా మహా నగరాలలో మాత్రమే చేయగలిగేవారని చెప్పారు. కానీ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ సాయంతో అందుబాటు ధరలకే హైదరాబాద్ లో చేయగలుగుతున్నట్లు వెల్లడించారు. విదేశాల్లో కాలేయమార్పిడి మీద పరిశోధనలు చేసి తిరిగి వచ్చాక హైదరాబాద్ లోని ఈ క్యాంపస్ ను ఎన్నుకొని ఆధునిక పరికరాల సాయంతో కాలేయం, జీర్ణ వ్యవస్త సమస్యలకు చికిత్సలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది చాలా రిస్క్ తో కూడిన అంశం అయినప్పటికీ, పేషంట్ కండీషన్ రీత్యా ఈ రకమైన ఆపరేషన్ చేసి సక్సెస్ చేసి విజయం సాధించినట్లు వివరించారు. ప్రెస్ మీట్ లో పాల్గొన్న రోగి , ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మృత్యు ముఖంనుంచి కాపాడిన డాక్టర్ రాఘవేంద్ర రావు బృందానికి ధన్యవాదాలు తెలిపారు.