మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       బిజినెస్ న్యూస్

ప్రపంచంలోనే అతి చిన్న మొబైల్ ఫోన్.. విడుదల చేసిన లండన్ కంపెనీ

Updated: 20-12-2017 06:28:26

న్యూఢిల్లీ: ఫీచర్ ఫోన్ల హవా నడిచినప్పుడు తొలుత పెద్ద పరిమాణంలో ఉండేవి. క్రమంగా స్లిమ్‌గా, చిన్నగా మారిపోయాయి. తర్వాత స్మార్ట్‌ఫోన్ల హవా మొదలైంది. మొదట చిన్నగా ఉన్న ఫోన్ల పరిమాణం క్రమంగా పెద్దగా మారింది. ఇప్పుడు ఎంత పెద్దగా ఉంటే అంత గొప్ప. అయితే లండన్‌కు చెందిన క్లూబిట్ న్యూ మీడియా అనే కంపెనీ ప్రపంచంలోనే అతి చిన్న మొబైల్‌ ఫోన్‌ను విడుదల చేసింది. క్రెడిట్ కార్డు కంటే చిన్నగా ఉండే ఈ ఫోన్‌కు ‘జాంకో టైనీ టీవన్’ అని పేరు  పెట్టారు. 
 
ప్రయోగాత్మకంగా విడుదల చేసిన ఈ ఫోన్ అథ్లెట్లు, జాగర్లకు బాగా ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 2జీ ఫోన్ అయిన జాంకో టైనీ టీవన్ ధర రూ.2,563. నానో సిమ్, 300 ఫోన్ బుక్ మెమొరీ, 50 మెసేజ్‌ల వరకు స్టోర్ చేసుకునే సామర్థ్యం, 200 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఢిల్లీకి చెందిన ఈ-కామర్స్ సంస్థ యెర్హా డాట్‌కామ్  గత నెలలో ‘నానోఫోన్ సీ’ పేరుతో అతి చిన్న మొబైల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.2,999 మాత్రమే.  

షేర్ :

మరిన్ని బిజినెస్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.