మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

స‌మంత పెళ్లి అయిన త‌రువాత తొలిసారి..!!

Updated: 13-10-2017 10:54:43

స‌మంత పెళ్లి అయ్యింది.  ఏ మాయ చేశావే అంటూ  నాగ చైత‌న్య తో  క‌ల‌సి తెలుగు వారికి ప‌రిచ‌యం అయ్యింది.  ఇప్పుడు అదే హీరోకు జీవిత భాగ‌స్వామి అయి  తెలుగు ఇంటి ఆడ ప‌డ‌చు అయ్యింది.  క‌ట్ చేస్తే.. త‌ను కోడ‌లిగా వెళ్లింది    తెలుగు సినిమా మూల‌స్థంభాల్లో ఒక‌రైన అక్కినేని నాగేశ్వ‌రావు  గారి ఇంటికి. ఆఫ్ కోర్స్ ఆయ‌న లేక పోయిన .. ఆయ‌న న‌ట వార‌సులుగా   దాదాపు అర‌డ‌జ‌ను హీరోలు వ‌చ్చారు. అస‌లు సిసిలు  న‌ట వారుసుడ నాగార్జున వీరింద‌రికి  పెద్ద త‌ల‌కాయి. ఇదంత ఒకెత్తు.
 
అయితే స‌మంత పెళ్లి  త‌రువాత  త‌న ల‌క్ ఎలా ఉందో నేడు రిలీజైన రాజుగారి గ‌ది 2 చిత్రంతో తెలిసి పోద్ది మ‌రి. ఎందుకంటే.. ఎందుకంటే  తెలుగు వారికి  అస‌లే సెంటిమెంట్స్ ఎక్కువ‌. కొత్త కోడ‌లు వ‌చ్చిన త‌రువాత  అన్ని పాజిటివ్ గా జ‌రుగుతుంటే..గోల్డెన్ లెగ్ అంటారు. అదే నెగిటివ్ గా జ‌రుగుతుంటే..  ఐర‌న్ లెగ్ అని ముద్ర‌లు వేసేస్తారు.  సినిమా స‌క్సెస్ అనేది ఒక్క‌రి మీద ఆధార ప‌డ‌దు. అయిన‌ప్ప‌టికి  అప‌జ‌యాల్ని మాత్రం ఆపాదించ‌క వ‌ద‌ల‌రు.   పెళ్లి త‌రువాత  స‌మంత న‌టించిన మొద‌టి చిత్రం  రాజు గారి గ‌ది 2 కావ‌డం విశేషం. ఈ చిత్రంలో త‌న మామ‌గారి తో క‌ల‌సి  న‌టించ‌డం  మ‌రో విశేషం.   ఇప్ప‌టి వ‌ర‌కు   థ్రిల్ల‌ర్స్ లో న‌టించ‌ని స‌మంత‌..  ఫ‌స్ట్ టైమ్ దెయ్యం గా క‌నిపిస్తుండ‌టం మ‌రో విశేషం. ఇలా  రాజు గారి గ‌ది  2 చిత్రం అక్కినేని వారి కుటుంబానికి చాల  ఇది ముఖ్యం మ‌రి.!  అయితే  మ‌ల‌యాళంలో రిలీజ్ అయిన  ప్రేతం చిత్రాన్ని  రాజుగారి గ‌ది 2 గా చేశారు.  ప్రామిసింగ్ ఫిల్మ్ అనేది ప‌రిశీల‌కుల మాట‌. 

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.