మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       సినిమా న్యూస్

నాగచైతన్య పెళ్లికొడుకాయనే! ఫొటోలు విడుదల చేసిన నాగార్జున

Updated: 06-10-2017 12:13:44

గోవా: నాగచైతన్య, సమంతల వివాహం గోవాలో జరుగుతోంది. పెళ్లి కోసం ముస్తాబైన నాగచైతన్యతో అక్కినేని నాగార్జున, అమల, అఖిల్, విక్టరీ వెంకటేష్ దిగిన ఫొటోలను నాగార్జున తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. పెళ్లికూతురు సమంత కోసం తామంతా ఎదురుచూస్తున్నామని నాగార్జున ట్వీట్ చేశారు. నేడు తొలుత హిందూ సంప్రదాయం ప్రకారం, రేపు క్రైస్తవ సంప్రదాయాల్లో వీరి వివాహ వేడుక జరుగుతుంది. వివాహం సింపుల్‌గా నిర్వహిస్తామని అక్కినేని నాగార్జున తెలిపారు. నెలాఖరులో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఫ్యాన్స్ కోసమే హైదరాబాద్ రిసెప్షన్ ఉంటుందన్నారు. పెళ్లికి అక్కినేని, రామనాయుడు, సమంత కుటుంబాలు హాజరౌతున్నాయి. ఏం మాయ చేశావే సినిమా సమయంలో నాగ చైతన్య, సమంత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత తల్లి దండ్రులకు చెప్పారు. దీంతో రెండు కుటుంబాలు కూడా పెళ్లికి అంగీకరించాయి. 

షేర్ :

మరిన్ని సినిమా న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.