రజనీకాంత్ నన్ను సంప్రదించలేదు
Updated:
10-02-2017 08:35:18
చెన్నై: రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే విషయంపై తనతో చర్చించారంటూ మీడియాలో వస్తున్న వార్తలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త గురుమూర్తి స్పందించారు. రజనీకాంత్ తన సలహా తీసుకోలేదని, అసలు ఆ విషయంపై చర్చనే జరగలేదని చెప్పారు. అవాస్తవాలు ప్రచురించరాదని, ప్రసారం చేయరాదని ఆయన మీడియాను కోరారు. రజనీకాంత్‌కు బిజెపి మద్దతిస్తోందంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. రజనీ సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉందని కూడా వార్తలు ప్రసారమయ్యాయి.