గవర్నర్‌తో స్టాలిన్ ఏమన్నారో తెలుసా?
Updated:
10-02-2017 05:11:23
చెన్నై: డిఎంకే నేత స్టాలిన్ తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించాక వినతిపత్రం కూడా అందించారు. 9 నెలలుగా తమిళనాట పాలన గాడి తప్పిందని, దారిలోకి తీసుకురావాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందన్నారు. పన్నీర్‌కు మద్దతిస్తున్నారంటోన్న శశికళ ఆరోపణలపై స్పందించబోనన్నారు. రాష్ట్రపతి పాలనకు తాము వ్యతిరేకమని స్టాలిన్ స్పష్టం చేసినట్లు సమాచారం.