మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

రజినీకాంత్‌కు బీజేపీ బంపరాఫర్.. ఎటూ తేల్చుకోలేకపోతున్న సూపర్‌స్టార్

Updated: 10-02-2017 11:21:21

చెన్నై: దేశరాజకీయాలను తనవైపు తిప్పుకుంటున్న తమిళ రాజకీయాలు మరో సంచలనం దిశగా దూసుకుపోతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు రజినీకి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసింది. రజినీకాంత్ గతంలో పలుమార్లు రాజకీయాలపై ఆసక్తి లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ‘పవర్’పై ఆసక్తి ఉన్నట్టు రజినీకాంత్ ప్రకటించి సంచలనానికి తెరలేపారు. అయితే తను పేర్కొన్న ‘పవర్’ ఆధ్యాత్మికతకు సంబంధించినదని పేర్కొంటూ అప్పటికి ఆ ఊహాగానాలకు పుల్‌స్టాప్ పెట్టారు. తాజాగా బీజేపీ ఆఫర్ చేసిన ముఖ్యమంత్రి పదవిపై రజినీకాంత్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం. ‘ఆఫర్’పై తన మిత్రులు, శ్రేయోభిలాషులతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.